Car Driving: ఆరేళ్ల అన్న.. మూడేళ్ల తమ్ముడితో కారు నడిపి.. ప్రమాదానికి గురై!

ఆరేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు కారు నడుపుకొంటూ రోడ్డుపైకి వచ్చి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన మలేషియాలో చోటుచేసుకుంది.

Published : 12 May 2023 01:28 IST

కౌలాలంపుర్‌: బొమ్మ కారు కొనేందుకని ఆరేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు అసలైన కారు నడుపుకొంటూ (Car Driving) రోడ్డుపైకి వచ్చిన ఘటన మలేషియా (Malaysia)లోని లాంగ్‌కావీలో జరిగింది. దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు అలాగే ప్రయాణించిన వారు.. చివరకు వాహనంపై అదుపు కోల్పోయి ఓ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ ఎక్కడున్నాడా? అని అక్కడున్నవారు వెతికి చూడగా.. చివరకు ఆ ఇద్దరు చిన్నారులను చూసి ఆశ్చర్యపోయారు.

తల్లిదండ్రులు ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా.. అన్నదమ్ములిద్దరు గుట్టుచప్పుడు కాకుండా కారును బయటకు తీసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసం కాగా, ఆరేళ్ల బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. బొమ్మ కారు కొనేందుకుగానూ దుకాణానికి బయల్దేరినట్లు వారు చెప్పడం గమనార్హం. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తొలుత ఎవరో మద్యం మత్తులో కారు తోలుతున్నట్లు భావించామని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పిల్లలిద్దరు క్షేమంగా బయటపడంతో ఊపిరి పీల్చుకున్నారు. వారిని తల్లిదండ్రులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని