USA: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఇద్దరి మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

Updated : 16 Jun 2024 16:54 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA)లో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌లో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి రౌండ్‌ రాక్‌లోని పార్కులో ఓ ఈవెంట్‌ జరిగింది. స్థానికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈవెంట్‌కు సమీపంలో రెండు గ్రూప్‌ల మధ్య వివాదం చోటు చేసుకొంది. దీంతో ఓ వర్గం మరో వర్గంపై కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

ముఖ్య విషయాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే నిందితులు పరారయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని