Ukraine Crisis: రష్యా బంగారంపై నిషేధం ?

రష్యా బంగారంపై యూకే, అమెరికా, కెనడా, జపాన్‌లు నిషేధం విధించనున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధంలో ఖర్చుచేసేందుకు రష్యా వద్ద నిధులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయంతీసుకొన్నారు. ఈ నిర్ణయం పుతిన్‌

Published : 27 Jun 2022 01:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా బంగారంపై యూకే, అమెరికా, కెనడా, జపాన్‌లు నిషేధం విధించనున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధంలో ఖర్చుచేసేందుకు రష్యా వద్ద నిధులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయంతీసుకొన్నారు. ఈ నిర్ణయం పుతిన్‌ యుద్ధ వనరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని యూకే పేర్కొంది. 2021లో రష్యా 15.4 బిలియన్‌ డాలర్లు విలువైన స్వర్ణాన్ని ఎగుమతి చేసింది. యుద్ధం ప్రారంభం కావడంతో రష్యా సంపన్నులు దీని కొనుగోళ్లను గణనీయంగా పెంచారు. జర్మనీలో జీ-7 భేటీ జరగనున్న సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. 

రష్యా బంగారాన్ని నిషేధించిన జాబితాలో జీ-7 దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ కూడా చేరాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సూచించారు. ‘‘బంగారం ఎగుమతుల నుంచి రష్యాకు పదుల బిలియన్ల డాలర్లు ఆదాయం సమకూరుతోంది. రష్యా నుంచి బంగారం దిగుమతులను నిషేధించినట్లు జీ-7 దేశాలు సమష్టిగా ప్రకటించాలి’’ అని బైడెన్‌ ట్విటర్‌లో కోరారు. బైడెన్‌కు మద్దతుగా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్వరం కలిపారు. ‘‘పుతిన్‌ యుద్ధ నిధులను అడుగంటేలా చేయాలి. యూకే, మిత్రపక్షాలు ఇప్పుడదే చేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. 

 లండన్‌ అతిపెద్ద గోల్డ్‌ ట్రేడింగ్‌ మార్కెట్లలో ఒకటి. తాజాగా యూకే మిత్రదేశాల చర్యలతో రష్యాకు నిధుల సమీకరణ కష్టం కానుంది. ఇప్పటికే అమెరికా, యూకే, ఐరోపా సమాఖ్యలు కలిపి దాదాపు 1,000 మంది రష్యా సంపన్నులు, అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. తాజా చర్యతో రష్యా లభించే 13.5 బిలియన్‌ డాలర్ల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. యూకే పార్లమెంట్‌లో బిల్లును ఆమోదింపజేస్తే.. ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని