Ukraine Crisis: ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ మొదలైంది..!

ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ మొదలైందని బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్‌ జావిద్‌ వ్యాఖ్యానించారు. రష్యాపై..బ్రిటన్‌ ఆంక్షలు విధించాలని ఆయన పేర్కొన్నారు

Published : 22 Feb 2022 15:58 IST

 బ్రిటన్‌ మంత్రి వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌డెస్క్‌:  ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ మొదలైందని బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్‌ జావిద్‌ వ్యాఖ్యానించారు. రష్యాపై..బ్రిటన్‌ ఆంక్షలు విధించాలని ఆయన సూచించారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ నేతృత్వంలో జరిగిన అత్యవసర సమావేశం జరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌ సంక్షోభం పై చర్చించారు.

 ‘‘ఉక్రెయిన్‌ ఆక్రమణ మొదలైందని మీరు అనుకోవచ్చు. అందుకే ముందుగానే చెప్పినట్లు  ఆంక్షలను విధిస్తాము. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన వీలైనంత మందిని ఈ ఆంక్షల పరిధిలోకి తెస్తాము’’ అని స్కై న్యూస్‌తో మాట్లాడుతూ సాజిద్‌ వ్యాఖ్యానించారు. అంతకుముందే రష్యా కంపెనీలు, ఇతర సంస్థలు డాలర్లు, బ్రిటిష్‌ పౌండ్లు వాడకుండా నిషేధించడంతోపాటు.. బ్రిటన్‌ నుంచి పెట్టుబడులు వెళ్లకుండా చర్యలు తీసుకొంటామని గతంలోనే యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. రష్యా బ్యాంకులు కూడా ఈ సారి ఆంక్షల పరిధిలోకి రావచ్చు. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పార్లమెంట్‌లో ఈ ఆంక్షలను ప్రకటించే అవకాశం ఉందని జావెద్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని