Rishi Sunak: వారికి రిషి సునాక్‌ సర్‌ప్రైజ్‌ కాల్స్‌

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌  తన సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. 

Published : 24 Dec 2022 22:45 IST

 

లండన్‌: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ ప్రభుత్వ సిబ్బందికి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. దేశం తరఫున ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోన్న వారికి స్వయంగా ఫోన్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా వారు అందిస్తోన్న సేవల పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. సంప్రదాయ సందేశానికి భిన్నంగా ఈసారి ఆయన దౌత్యవేత్తలు, రాయల్ నావీ సిబ్బంది, సోమాలియా, పాకిస్థాన్‌, ఉక్రెయిన్‌, యూకేలో సేవలు అందిస్తోన్న చైల్డ్‌ కేర్ సిబ్బందికి కాల్ చేశారు. వారు చేస్తోన్న త్యాగాలకు రుణపడి ఉంటానని తెలియజేశారు.

‘మీరు ఈ క్రిస్మస్‌కు మొగదిషు(సోమాలియా రాజధాని) లేక ఇంగ్లండ్‌ నగరంలో పనిచేస్తున్నా.. నేను మీకో విషయం తెలియజేయాలనుకుంటున్నాను. నేను మీ త్యాగాలకు రుణపడి ఉన్నాను. పలు కారణాల వల్ల ఇది మనకు అసాధారణమైన సంవత్సరం. విదేశాలకు సహాయం చేయడం, ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలవడం వంటి చర్యలతో ఈ ఏడాది మనదేశం గొప్ప స్ఫూర్తిని ప్రదర్శించింది. ఈ పండగ సమయంలో అంకితభావంతో పనిచేస్తోన్న వారిపట్ల వినయంతో ఉన్నాను. ఈ సమయంలో మీ నిస్వార్థ సేవ దేశంలో సంతోషాలను వెదజల్లుతుంది’ అంటూ ప్రకటన విడుదల చేశారు. అంతేగాకుండా ఉక్రెయిన్ ప్రజల కోసం ఒక వీడియోను విడుదల చేశారు. ‘ఈ క్రిస్మస్ వేళ.. మేం మీతో ఉంటాం’ అని ఆ దేశానికి మద్దతు ప్రకటించారు. దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని