Ukraine Crisis: ఈ యుద్ధం ఉక్రెయిన్‌తో ఆగదు: జెలెన్‌స్కీ

రష్యా దండయాత్ర.. ఉక్రెయిన్‌తో ముగియదని, ప్రపంచంలో ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు.

Published : 09 Mar 2022 01:34 IST

కీవ్‌: రష్యా దండయాత్ర.. ఉక్రెయిన్‌తో ముగియదని, ప్రపంచంలో ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మృగంతో పోల్చిన జెలెన్‌స్కీ.. ఆయన ఎప్పటికీ సంతృప్తి చెందరని వ్యాఖ్యానించారు. తినేకొద్దీ ఆ మృగం ఇంకా కావాలంటూ మిగిలిన దేశాలపైనా దాడికి దిగుతుందని హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని ఆపే సామర్థ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉన్నట్టు పేర్కొన్నారు. రష్యా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులు తమపై దాడి చేస్తున్నాయని.. అందుకే ఉక్రెయిన్‌పై నో ఫ్లై జోన్‌ విధించాలని జెలెన్‌స్కీ మరోసారి విజ్ఞప్తి చేశారు. జెలెన్‌స్కీ చేసిన నో ఫ్లై జోన్‌ విజ్ఞప్తిని ఇటీవల నాటో దేశాలు తిరస్కరించిన వేళ ఆయన మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని