Ukraine: కనుచూపు మేరలో వినాశనమే..!
ఉక్రెయిన్‌పై రష్యా ప్రకటించిన యుద్ధం ఎంత వినాశనం సృష్టించిందో ప్రపంచానికి తెలియజేసే ఫొటోలు విడుదలయ్యాయి. ఉక్రెయిన్ విదేశాంగశాఖ ఈ ఫొటోలను ట్వీట్ చేసింది.
ఇంటర్నెట్‌డెస్క్: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) దాడులు మొదలుపెట్టిన నాటి నుంచి ఊహించని వినాశనం చోటు చేసుకొంది. కళ్లముందే మేరియుపోల్ వంటి నగరాలు నేలమట్టమయ్యాయి. తాజాగా డొనెట్స్క్ ప్రాంతంలోని ఓ పట్టణం ఏ స్థాయిలో ధ్వంసమైందో తెలియజేస్తూ ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ ఓ ట్వీట్ చేసింది. డ్రోన్ నుంచి దీనికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించారు. డొనెట్స్క్‌లోని ‘మరింక’ అనే నగరం దృశ్యాలు కలచివేసివిగా ఉన్నాయి. కనుచూపు మేరలో మొత్తం భూమి కాలిబూడిదైపోయింది.
గతంలో దాదాపు 10,000 మంది నివాసం ఉన్న ఈ నగరంలో ఇప్పుడు ఎవరూ లేరు. ఇళ్లు పూర్తిగా శిథిలమైపోయాయి. ఈ నగరంలో పేలుడు జరగని ప్రాంతమంటూ కనిపించదు. డాన్‌బాస్ వేర్పాటువాదులు దీనిపై తొలిసారి దాడి చేసి ఆధీనంలోకి తీసుకొన్నారు. కానీ, నాలుగు నెలల తర్వాత ఉక్రెయిన్ ఈ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకొంది. ఈ పోరాటాల దెబ్బకు నగరం మొత్తం బూడిద కుప్పగా మారిపోయింది. అక్కడ ఒక్క మనిషి కూడా జీవించడానికి అవకాశం లేకుండా పోయింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Harish Shankar: ఉస్తాద్ భగత్‌సింగ్‌పై నెటిజన్ ట్వీట్.. డైరెక్టర్ కౌంటర్
-
Sports News
Virat Kohli: విరాట్ ‘జెర్సీ నంబరు 18’ వెనుక.. కన్నీటి కథ
-
Movies News
Farzi: ఓటీటీలో రికార్డు సృష్టించిన షాహిద్‌కపూర్ ‘ఫర్జీ’..!
-
General News
ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Selfie: సెల్ఫీలు తీసుకున్న గాంధీ, థెరెసా, చెగువేరా