Ukraine Crisis: కాల్పుల విరమణ ఉండకపోవచ్చు..!

మాస్కోతో కాల్పుల విరమణ లేదా ఇతర ఒప్పందాలు జరిగే అవకాశాలను ఉక్రెయిన్‌ తోసిపుచ్చింది. డాన్‌బాస్‌ ప్రాంతంలో పోరు తీవ్రం కావడం, ఫిన్లాండ్‌కు రష్యా

Published : 22 May 2022 14:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాస్కోతో కాల్పుల విరమణ లేదా ఇతర ఒప్పందాలు జరిగే అవకాశాలను ఉక్రెయిన్‌ తోసిపుచ్చింది. డాన్‌బాస్‌ ప్రాంతంలో పోరు తీవ్రం కావడం, ఫిన్లాండ్‌కు రష్యా గ్యాస్‌ నిలిపివేయడం వంటి చర్యలపై  స్పందిస్తూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే  మేరియుపోల్‌ నగరం రష్యా చేతికి దక్కడంతో.. ఇప్పుడు క్రెమ్లిన్‌ దృష్టి లుహాన్స్క్‌ ప్రాంతంపైకి మళ్లించింది. డాన్‌బాస్‌ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ నుంచి పూర్తి స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది. 

నేడు ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ను ఉద్దేశించి పోలాండ్‌ అధ్యక్షుడు ఆడ్రీజేజ్‌ డూడా ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ మాట్లాడుతూ..‘‘డాన్‌బాస్‌ ప్రాంతంలో పరిస్థితి అత్యంత కఠినంగా ఉంది. స్లోవియాన్స్క్‌, సివోరో డొనెట్స్క్‌పై రష్యా సేనలు అత్యంత తీవ్రమైన దాడులు చేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. 

యుద్ధంలో కీలక సమయంలో రష్యాకు ఎటువంటి అవకాశం ఇచ్చినా.. అది రెట్టింపు శక్తితో దాడి చేస్తుందని ఉక్రెయిన్‌కు చెందిన అధికారులు చెబుతున్నారు. యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణ ప్రకటించాలని ఇటీవల అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌, ఇటలీ ప్రధాని మారియో డ్రాగి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని