Ukraine Crisis: రష్యా బాంబుల వర్షం.. సాయం కోరిన జెలెన్‌స్కీ

రష్యా వరుస బాంబు దాడులకు దిగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ భాగస్వామ్య దేశాల మద్దతు కోరింది. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు.

Published : 23 Jun 2024 18:45 IST

కీవ్‌: రష్యా, ఉక్రెయిన్‌ (Ukraine Cisis) మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్‌పై (Kharkiv) మాస్కో (Moscow) బాంబులతో విరుచుకుపడిన గంటల వ్యవధిలోనే కీవ్‌ ప్రతిదాడులకు దిగింది. ఆదివారం రాత్రి ఒకేసారి 30 డ్రోన్లతో దాడులు ప్రారంభించింది. అయితే అప్రమత్తమైన రష్యా దళాలు వాటిని కూల్చివేసినట్లు ఆ దేశ అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. శనివారం ఖార్కీవ్‌లోని ఓ ఐదంతస్తుల భవనంపై రష్యా చేసిన బాంబుదాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. దీంతో రష్యాలోని పశ్చిమ బ్రయాన్స్క్‌, స్మోలెన్స్క్, లిప్టెస్స్క్‌ తదితర ప్రాంతాలపై దాడి చేసేందుకు ఉక్రెయిన్‌ డ్రోన్‌లను ప్రయోగించింది. అయితే, పసిగట్టిన రష్యా ఆర్మీ వాటిని కూల్చివేసింది.

రింగురింగులుగానే టెలిఫోన్‌ రిసీవర్‌ వైరు.. ఎందుకో తెలుసా?

మరోవైపు ఇహోర్‌ తెరికోవ్‌ నగరంపై శుక్రవారం రాత్రి రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందగా.. 18 మంది గాయపడ్డారు. ఈ వరుస దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిన్‌ జెలెన్‌స్కీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భాగస్వామ్య దేశాలన్నీ ఉక్రెయిన్‌ వైమానిక రక్షణను బలోపేతం చేసుకునేందుకు సహకరించాలని కోరారు. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాలని విజ్ఞప్తిచేశారు. అమెరికా అందజేయనున్న ఎఫ్‌-16 విమానాలు నడిపేందుకు వీలుగా త్వరితగతిన పైలట్‌లకు శిక్షణ ఇవ్వాలన్నారు. రష్యాను సమర్థంగా ఎదుర్కొనేందుకు సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే ఆయుధాలను వినియోగించాల్సిన అవసరముందని, ఆ దిశగా భాగస్వామ్య దేశాలు సాయం చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని