Ukraine: యుద్ధంలో కుంగిన ఉక్రెయిన్‌కు ఐఎంఎఫ్ 15 బిలియన్ డాలర్ల చేయూత!
యుద్ధంతో ఆర్థికంగా చితికిపోయిన ఉక్రెయిన్‌కు ఐఎంఎఫ్ (IMF) ఊతం ఇవ్వనుంది. ఈమేరకు ఓ భారీ ప్యాకేజీకి సన్నాహాలు చేస్తోంది.
ఇంటర్నెట్‌డెస్క్: యుద్ధం దెబ్బకు ఆర్థికంగా కుంగిపోయిన ఉక్రెయిన్(Ukraine)కు సాయం చేసేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) (IMF) ముందుకొచ్చింది. ఈ మేరకు ఉక్రెయిన్‌తో ఆ సంస్థ స్టాఫ్ లెవల్ అగ్రిమెంట్‌కు వచ్చింది. దీని ప్రకారం 15.6 బిలియన్ డాలర్ల సొమ్మును ఉక్రెయిన్‌కు అందజేయనుంది. ఒక వేళ దీనికి ఆమోదముద్ర పడితే.. యుద్ధంలో ఉన్న ఒక దేశానికి ఐఎంఎఫ్ రుణం మంజూరు చేయడం ఇదే తొలిసారి అవుతుంది. రష్యా దాడి మొదలైన తర్వాత ఉక్రెయిన్‌కు అందుతున్న అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీ కూడా ఇదే.
తీవ్ర అస్థిరతను ఎదుర్కొనే దేశాలకు రుణాలు మంజూరు చేసే విషయంలో ఐఎంఎఫ్ ఇటీవల నిబంధలను సడలించింది. ‘‘రష్యా ఆక్రమణ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది. అక్కడ ఆర్థిక వృద్ధిరేటు దాదాపు 30 శాతం కుంగింది. చాలా వరకు ఉత్పత్తి కర్మాగారాలు, సరుకులు దెబ్బతిన్నాయి. పేదరికం స్థాయి భారీగా పెరిగింది’’ అని ఐఎంఎఫ్ అధికారి గవిన్ గ్రే పేర్కొన్నారు. సరికొత్త ఒప్పందంతో ఉక్రెయిన్‌కు భారీగా నిధులు అందే అవకాశం ఉందని వెల్లడించారు.
కొత్త ఫండ్ పాలసీ ఆధారంగా ఉక్రెయిన్‌కు సాయం ప్యాకేజీని రూపొందించారు. దీంతోపాటు జీ-7 దేశాలు, ఐరోపా సమాఖ్య కూడా భారీగా నిధులు సమకూర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మేహాల్ మాట్లాడుతూ నిధులు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటంతోపాటు.. కీలక ఖర్చులకు ఉపయోగపడతాయన్నారు. స్థూల ఆర్థిక స్థిరత్వంతోపాటు.. అంతర్జాతీయ భాగస్వాములతో సంబంధాలను కూడా మెరుగు పరుస్తుందని డెనిస్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత నెల అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ అలెన్ హఠాత్తుగా ఉక్రెయిన్‌ను సందర్ళించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉక్రెయిన్‌ను ఆర్థికంగా నిలబెట్టేందుకు ఐఎంఎఫ్ కార్యక్రమం కీలకమని వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!