Ukrain: ఉక్రెయిన్ పైలట్లకు అమెరికాలో శిక్షణ..!
ఉక్రెయిన్ పైలట్లకు అమెరికాలోని అరిజోనాలో శిక్షణ ఇస్తున్నారు. ఏ ఆయుధాలపై ఈ శిక్షణ జరుగుతోంది అనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఎఫ్-16లు మాత్రం వారికి ఇవ్వడంలేదని అమెరికా చెబుతోంది.
ఇంటర్నెట్‌డెస్క్: ఉక్రెయిన్(Ukrain) వైమానిక దళానికి చెందిన పైలట్లకు అమెరికాలోని అరిజోనాలో ప్రత్యేక సిమ్యూలేటర్లపై శిక్షణ ఇస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ అధికారులు కూడా ధ్రువీకరించారు. దీంతో అమెరికా(USA) నుంచి యుద్ధ విమానాలు కూడా సాయం రూపంలో ఉక్రెయిన్(Ukrain)కు అందనున్నాయనే ప్రచారం జరుగుతోంది. కానీ, వాషింగ్టన్ మాత్రం ఈ విషయంపై మౌనంగా ఉంటోంది. ఇప్పటికే అమెరికా మిత్రపక్షాల నుంచి జావెలిన్ క్షిపణులు, హిమార్స్ రాకెట్ లాంఛర్లు భారీ ఎత్తున ఉక్రెయిన్‌కు అందాయి. కానీ, ఫైటర్ జెట్ విమానాలు, భారీ డ్రోన్లు ఇస్తామని మాత్రం ఇప్పటి వరకు పశ్చిమ దేశాలు ఎక్కడా వెల్లడించలేదు. ‘‘తాజా శిక్షణతో ఉక్రెయిన్ పైలట్లు మరింత మెరుగ్గా పనిచేసేందుకు అవకాశం లభిస్తుంది’’ అని అమెరికా అధికారులు చెబుతున్నారు. అమెరికా వైమానిక దళం ఎలా పనిచేస్తోందో ఉక్రెయిన్ పైలట్లు అరిజోనాలో చూసి నేర్చుకొనే అవకాశం లభించింది.
ఓ వైపు అమెరికా-ఉక్రెయిన్ సైనికాధికారుల మధ్యలో చర్చలు జరుగుతుండగా ఈ శిక్షణ విషయం వెలుగులోకి రావడం విశేషం. గతంలో అమెరికా మిత్రదేశాల్లో కూడా ఉక్రెయిన్ సేనలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికాలో శిక్షణ ఎంతకాలం జరిగిందో మాత్రం వెల్లడించలేదు. ఎఫ్-16లపై ఉక్రెయిన్ పైలట్లకు ఎటువంటి శిక్షణను ప్రారంభించలేదని రక్షణశాఖ అండర్ సెక్రటరీ కొలిన్ ఇటీవల ప్రతినిధుల సభకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అందబోయే విమానాలు ఏమిటనే విషయం ఇప్పటి వరకు వెల్లడికాలేదు. బ్రిటిష్ టోర్నిడోలు, స్వీడన్ గ్రిపిన్‌లు, ఫ్రాన్స్ మిరేజ్ విమానాలు అందే అవకాశలున్నాయనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు అరిజోనాలో వేటిపై శిక్షణ పొందుతున్నారనే విషయం గోప్యంగానే ఉంది. శనివారం కూడా ఉక్రెయిన్ పైలట్లు అమెరికాలోనే ఉన్నారని అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి.
ఫిబ్రవరిలో బైడెన్ కీవ్ పర్యటన సందర్భంగా కనీసం 120 యుద్ధ విమానాలు కావాలని ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ కోరారు. ఈ విషయాన్ని బైడెన్ కూడా ధ్రువీకరించారు. అమెరికా మాత్రం 50 నుంచి 80 మధ్యలో ఎఫ్-16 యుద్ధ విమానాలు సరిపోతాయని అంచనా వేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి
-
World News
Space: ఇకపై అంతరిక్షంలో వ్యోమగాములు ఫ్రెంచ్ ఫ్రైస్ తినొచ్చు!
-
India News
Odisha Train Accident: ఏఐ సాంకేతికతతో మృతదేహాల గుర్తింపు!
-
Movies News
Social Look: ఐస్‌క్రీమ్‌తో రకుల్‌ప్రీత్.. చెప్పుతో తేజస్విని.. తమన్నా ప్రచారం!