Ukraine: జెలెన్‌స్కీ ఇంటి ఎదుట ‘నాటు-నాటు’.. దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
ఆర్‌ఆర్‌ఆర్ (RRR) సినిమాలోని నాటునాటు (Naatu Naatu) పాట చిత్రీకరించిన ఉక్రెయిన్‌లోని జెలెన్‌స్కీ అధికార నివాసం ఎదుట కొందరు సైనికులు నాటునాటు పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్‌డెస్క్: దర్శకధీరుడు రాజమౌళి (RajaMouli) దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. రికార్డుల మీద రికార్డులు కొట్టేసింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎక్కడ చూసినా చర్చ ఈ పాట గురించే.. అందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ వేసిన స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు. సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు కాలు కదిపారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా అక్కడ ఈ పాట ప్లే చేయాల్సిందే.. స్టెప్పులు వేయాల్సిందే అన్నంతలా మారిపోయింది.
ఇటీవల జమ్ముకశ్మీర్‌లో నిర్వహించిన జీ20 సదస్సు వేదికపైనా ఈ పాటకు స్టెప్పు లేశారు. ఒరిజినల్ సాంగ్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) అధికారిక నివాసం ఎదుట ఆగస్టు 2021లో చిత్రీకరించారు. తాజాగా అదే చోట ఈ సాంగ్‌ను ఉక్రెయిన్ సైనికులు చిత్రీకరించారు. దాదాపుగా అవే స్టెప్పులతో అదరగొట్టారు. అయితే వీరు తమపై దాడి చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా పాటను చిత్రీకరించారు. పాటలో సైనికులు డ్రోన్స్ ఎగురవేస్తున్నట్లు కనిపించింది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోన్న భయంతో ఉన్న సైనికుల ముఖాల్లో ఈ ‘నాటు నాటు’ ఆనందం నింపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Justice Lakshmana Reddy: జస్టిస్ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం
-
‘భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఏం చేశారు?’
-
AP News: హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లాలా?
-
పాపికొండల యాత్ర ప్రారంభం
-
నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్