Ukraine: ఉక్రెయిన్ అణువిద్యుత్ కేంద్రాల రక్షణకు ఐక్యరాజ్యసమితి నిఘా బృందాలు!
అణువిద్యుత్ కేంద్రాలపై దాడులు జరిగే అవకాశంలో రక్షణ కల్పించాలని ఐక్యరాజ్యసమితి నిఘా విభాగాన్ని ఉక్రెయిన్ కోరింది. దీనికి యూఎన్ సమ్మతి తెలిపినట్లు ఆ దేశ ప్రధాని వెల్లడించారు.
పారిస్: ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్ కేంద్రాలను(Atomic plants) సంరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి నిఘా విభాగం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) ప్రత్యేక దళాలను పంపేందుకు సమ్మతించిందని ఆ దేశ ప్రధాని డెనైస్ ష్యమ్గల్ వెల్లడించారు. ప్రస్తుతం రష్యా (Russia) అధీనంలో ఉన్న జపోరిజియా (Zaporizhzhia) అణువిద్యుత్ కేంద్రం రక్షణ కూడా ఐఏఈఏ పరిధిలోకే వస్తుందని చెప్పారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటికే రష్యా కొన్ని అణువిద్యుత్ కేంద్రాలపై దాడికి దిగుతుండటంతో చెర్నోబిల్ లాంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ఉక్రెయిన్ సహా వివిధ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్.. ఐఏఈఏ సాయం కోరింది. ప్రత్యేకంగా రష్యా దళాలు దాడులకు పాల్పడకుండా ఈ దళాలు రక్షణ కల్పిస్తాయని ష్యమ్గల్ వెల్లడించారు. ఈ మేరకు ఐఏఈఏ అధ్యక్షుడు రఫేల్ గ్రోసితో పారిస్‌లో సమావేశమైన అనంతరం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
జపోరిజియా అణువిద్యుత్ కేంద్రానికి ఇప్పటికే ఐఏఈఏ బృందాలు రక్షణ కల్పిస్తున్నాయి.ఇదే కాకుండా కీలకమైన రివ్నే, ఖెమెలెన్ట్క్సీ, పివ్డెన్నోక్రైన్సికా, చెర్నోబిల్ తదితర అణువిద్యుత్ కేంద్రాల్లోనూ ఐఏఈఏ బృందాలు పహారా కాస్తాయని ష్యమ్గల్ వెల్లడించారు. మరోవైపు జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం నుంచి రష్యా దళాలను పూర్తిగా వెనక్కి పంపించడం ఎంత ఆవశ్యకమో రఫేల్ గ్రోసితో మరోసారి చర్చించానన్నారు.
మరోవైపు సమావేశానికి ముందు రఫేల్ గ్రోసి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే జపోరిజియా అణువిద్యుత్ కేంద్రంలో ఐఏఈఏ బృందాలను మోహరించాయని, దీనికి మరింత రక్షణ కల్పించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు. అయితే, ప్రస్తుతం ఈ విద్యుత్ కేంద్రం సురక్షితంగానే ఉందని చెప్పారు. రష్యా సేనలు కూడా సహకరించినప్పుడే జపోరిజియా రక్షణ మరింత సులభమవుతుందని చెప్పారు. మరోవైపు జపోరిజియా అణువిద్యుత్ కేంద్రంలో పని చేస్తున్న ఇద్దరు కీలక ఉద్యోగులను రెండు రోజుల క్రితం రష్యా దళాలు తొలగించాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌లో విద్యుత్ కొరతను సృష్టించి, వారి రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని రష్యా భావిస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా అణువిద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
కొరియా ద్వీపకల్పంలో ఐరాస విధించిన ఆంక్షలు ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ఏమాత్రం ఉపయుక్తంగా లేవని రష్యా పేర్కొంది. -
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. -
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్‌లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్‌పై దాడుల పరంపర
ఉక్రెయిన్‌లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్‌ఫోర్డ్‌లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్‌తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ