వీటో చేస్తే సమాధానమివాల్సిందే!

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల్లో ఎవరైనా తమ వీటో అధికారాన్ని వినియోగించి ఏదైనా తీర్మాన్ని అడ్డుకున్నట్లయితే

Published : 27 Apr 2022 07:08 IST

 ఆ దిశగా ఐక్యరాజ్య సమితి చర్యలు 

ఐరాస: ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల్లో ఎవరైనా తమ వీటో అధికారాన్ని వినియోగించి ఏదైనా తీర్మాన్ని అడ్డుకున్నట్లయితే అందుకు గల కారణాలపై సర్వప్రతినిధి సభకు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని 193 మంది సభ్యులు కలిగిన సర్వప్రతినిధి సభ మంగళవారం ఏకగీవ్రంగా ఆమోదించింది. ఈ చర్య వీటో దేశాలకున్న ప్రత్యేక అధికారాన్ని తొలగించడం, లేదా పరిమితం చేయడం కానీ చేయలేదు. అయితే,  తాము వీటో ఎందుకు చేయాల్సి వచ్చిందో సర్వప్రతినిధుల సభకు వివరించాల్సి ఉంటుంది. ఇందుకోసం సర్వప్రతినిధి సభ పది రోజుల్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించవచ్చు. వీటో అధికారం కలిగిన దేశం సర్వప్రతినిధుల సభకు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి రావడం ఇదే ప్రథమం. వీటో అధికారంలేని దేశాలు, భద్రతామండలిలో సభ్యత్వం లేని దేశాలు కూడా తమ గళాన్ని వినిపించేందుకు ఇది అవకాశం కల్పిస్తుందని ఐరాస రాయబారి క్రిస్టియన్‌ వెనవీసర్‌ తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో వీటో అధికారాన్ని అడ్డుపెట్టుకొని తనకు వ్యతిరేకంగా తీసుకునే చర్యలను రష్యా నిరోధించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐరాస ఇటువంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌ దేశాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని