Nijjar Killing: నిజ్జర్‌ హత్య: కెనడా వాదనకు అమెరికా మద్దతు..!

Nijjar Killing: నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని వచ్చిన ఆరోపణలపై తాము కెనడాతో సమన్వయం చేసుకుంటున్నామని అమెరికా తెలిపింది. ఈ కేసులో దర్యాప్తునకు భారత్‌ సహకరించాలని మరోసారి సూచించింది.

Updated : 03 Oct 2023 13:45 IST

వాషింగ్టన్‌: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య (Nijjar Killing) కేసులో కెనడా (Canada) దర్యాప్తునకు భారత (India) ప్రభుత్వం సహకరించాలని అగ్రరాజ్యం అమెరికా (USA) మరోసారి సూచించింది. ఈ విషయమై ఇప్పటికే బైడెన్‌ యంత్రాంగం దిల్లీ అధికారులతో పలు సార్లు చర్చించినట్లు అమెరికా సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ వ్యవహారంలో కెనడాతో తాము సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

భారత్, కెనడా (India - Canada Diplomatic Row) మధ్య దౌత్య ఉద్రిక్తతలపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ను ఓ పాక్‌ విలేకరి ప్రశ్నించారు. దీనికి మిల్లర్‌ స్పందిస్తూ.. ‘‘దీనిపై మేం మా వైఖరిని గతంలోనే స్పష్టంగా చెప్పాం. మరోసారి చెబుతున్నాం. ఈ వ్యవహారంపై కెనడాతో మేం సమన్వయం చేసుకుంటున్నాం. ఇక, కెనడా చేపట్టిన దర్యాప్తునకు భారత ప్రభుత్వం సహకరించాలని మేం పలుమార్లు సూచించాం. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌.. భారత విదేశాంగ మంత్రితో జరిపిన సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు’’ అని చెప్పారు.

కెనడాకు భారత్ అల్టిమేటం.. అక్టోబరు 10లోగా దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలని డెడ్‌లైన్..!

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రాజేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అయితే, ఇరు దేశాలకు మిత్రపక్షంగా ఉన్న అమెరికా.. ఈ విషయంలో తొలుత తటస్థంగా వ్యవహరించినా.. ఆ తర్వాత తన స్వరాన్ని మెల్లిగా మార్చింది. కెనడా దర్యాప్తునకు భారత్‌ సహకరించాలని పదేపదే చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా.. నిజ్జర్ హత్యపై నిఘా సమాచారాన్ని కూడా అగ్రరాజ్యమే కెనడాకు ఇచ్చినట్లు అమెరికా పత్రికల్లో కథనాలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు