Japan: ట్రంప్‌ కాలం నాటి టారిఫ్‌ వార్‌కు చెల్లుచీటి

ట్రంప్‌ పాలన సమయంలో జపాన్‌ నుంచి స్టీల్‌ దిగుమతులపై విధించిన టారీఫ్‌లను తొలగించాలని అమెరికా నిర్ణయించింది.

Updated : 08 Feb 2022 13:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్రంప్‌ పాలన సమయంలో జపాన్‌ నుంచి స్టీల్‌ దిగుమతులపై విధించిన టారిఫ్‌లను తొలగించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు జపాన్‌ - అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. అధిక స్టీల్‌ సరఫరా వల్ల తలెత్తుతున్న సమస్యలు ఈ డీల్‌తో తొలగుతాయని జపాన్‌ పేర్కొంది. చైనా అధిపత్యం వహిస్తున్న ప్రపంచ స్టీల్‌ పరిశ్రమలో అనైతిక విధానాలకు దీనితో ముగింపు పలకాలని ఒప్పందంలో పేర్కొన్నారు.

ఈ సరికొత్త ఒప్పందం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పరిణామాలతో తమ మిత్ర దేశాలతో సంబంధాలు మరింత బలపడతాయని అమెరికా  వాణిజ్య మంత్రి గినా రైమాండో అభిప్రాయపడ్డారు. సమష్టిగా చైనా అనైతిక చర్యలపై పోరాడేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తాజా డీల్‌ ప్రకారం జపాన్‌ నుంచి వచ్చే స్టీల్‌పై విధిస్తున్న 25శాతం టారిఫ్‌ను అమెరికా తొలగించింది. దీంతోపాటు ఏడాదికి 1.25 మిలియన్‌ టన్నుల  అల్యుమినియం ఎగుమతి పరిమితిని తొలగించింది.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్న సమయంలో మిత్రదేశాలపై భారీగా టారిఫ్‌లు విధించారు. అతి తక్కువ ధరకు దిగుమతి చేసుకొనే లోహాలు దేశ భద్రతకు ముప్పుగా మారాయని ట్రంప్‌ వాదన. దీంతో చాలా దేశాలతో అమెరికాకు అభిప్రాయభేదాలు తలెత్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు