Published : 02 Jul 2022 02:11 IST

Pakistan: అగ్ర దేశాలకు ‘డంపింగ్‌ యార్డు’గా మారిన పాకిస్థాన్‌!

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంక్షోభానికి తోడు పాకిస్థాన్‌ను మరో సమస్య వెంటాడుతోంది. అదే చెత్త సమస్య.. పలు అగ్ర దేశాల నుంచి పాకిస్థాన్‌ చెత్తను దిగుమతి చేసుకుంటోందని తెలుసుకున్న ఆ దేశ వాతావరణ మార్పులపై సెనేట్ స్టాండింగ్ కమిటీ షాక్‌కు గురైంది. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ సహా కెనడా, ఇటలీ, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి దేశం వ్యర్థాలను దిగుమతి చేసుకుంటోందని తెలుసుకుని కంగుతిన్నట్లు ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ నివేదించింది. వాతావరణ మార్పు సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసే దేశాల పేర్లు ఈ జాబితాలో ఉండటం గమనార్హం.

వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి.. వాటి నుంచి బంగారం‌, కాపర్‌, అల్యూమినియం వంటి ఖనిజాలను పాకిస్థాన్‌ బయటకు తీస్తోంది. ఇందుకు భారీగా వ్యర్థాలను దిగుమతి చేసుకుంటోంది. అయితే ఈ విషయం తమకు తెలియదని అక్కడి నేతలు పేర్కొనడం ఆశ్చర్యకర విషయం. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలకు పాకిస్థాన్ డంపింగ్ యార్డుగా మారిందన్న వాస్తవం తమకు తెలియదని మెజారిటీ సెనేటర్లు అంగీకరించడం విస్తుగొలుపుతోంది. నగరాల్లోని వీధులు వ్యర్థాలతో విషపూరితంగా మారుతున్నాయని కొందరు వాపోయారు.

‘దిగుమతి చేసిన వ్యర్థాలు అంగీకరించలేం’ అని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సెనేటర్ ఫైసల్ జావేద్ పేర్కొన్నారు. దేశాన్ని ‘దిగుమతి చేసుకున్న ప్రభుత్వం’ పరిపాలిస్తోందని తన పార్టీ అధినేత మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను ఉటంకించారు. ‘ఎంబసీలు, మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాలు, ప్రాంతీయ, సమాఖ్య ప్రభుత్వం ఈ దిగుమతులను ఆపేందుకు ఎందుకు ప్రయత్నించలేదు’ అని సెనేట్ స్టాండింగ్ కమిటీకి చెందిన ఓ సభ్యుడు ప్రశ్నించినట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.

సరకు రవాణా చేసే సమయంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వ్యర్థాలను సముద్రంతోపాటు పాక్‌లోని ప్రధాన నగరాల్లో ఎక్కువగా పడేస్తున్నట్లు సెనేట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో వెల్లడైంది. పాకిస్థాన్‌ ఏటా 30 మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోందని, దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఏటా 80వేల టన్నుల బండిల్డ్ వ్యర్థాలను దిగుమతి అవుతుండటంతో పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పాకిస్థాన్‌ మంత్రివర్గానికి తెలియజేసిన వారం తర్వాత  ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని