Ukraine Crisis: ఒకే వ్యోమనౌకలో భూమికి చేరనున్న అమెరికా, రష్యా వ్యోమగాములు..!

ఉక్రెయిన్ యుద్ధంతో అమెరికా, రష్యా కయ్యానికి కాలు దువ్వుతున్నప్పటికీ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇరు దేశాలు..

Published : 31 Mar 2022 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్ యుద్ధంతో అమెరికా, రష్యా కయ్యానికి కాలు దువ్వుతున్నప్పటికీ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇరు దేశాలు.. ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి. అంతరిక్ష కేంద్రంలో రికార్డు స్థాయిలో 355 రోజులు గడిపిన అమెరికా వ్యోమగామిగా ఖ్యాతినార్జించిన మార్క్ వాన్ డే హే.. ఇవాళ రష్యా వ్యోమనౌక సోయుజ్ క్యాప్సుల్స్‌లో భూమికి చేరనున్నారు. ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో ఏడాదిపాటు ఉన్న రష్యా వ్యోమగాములు అంటోన్ ష్కప్లెరోవ్, ప్యోటర్-డుబ్రోవ్‌తో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వ్యోమ నౌక కజకిస్తాన్‌లో దిగనుంది. ఓ వైపు ఉక్రెయిన్ యుద్ధంతో రష్యాపై అమెరికా కఠిన ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తుండగా.. ఇరుదేశాల వ్యోమగామలు మాత్రం కలిసి భూమికి చేరనుండటం ఆసక్తికరంగా మారింది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని