Porn classes: ‘పోర్న్‌’పై కాలేజీలో క్లాసులు.. అమెరికా కళాశాల ప్రకటన

అమెరికాలోని ఓ కళాశాల పోర్న్‌ తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రానున్న వేసవిలో తమ కాలేజీలో పోర్న్‌పై ప్రత్యేక తరగతులు.......

Published : 28 Apr 2022 01:31 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని ఓ కళాశాల పోర్న్‌ తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రానున్న వేసవిలో తమ కాలేజీలో పోర్న్‌పై ప్రత్యేక తరగతులు ప్రారంభించనున్నట్లు ఉతాలోని సాల్ట్‌లేక్‌లో గల వెస్ట్‌మిన్‌స్టెర్‌ కళాశాల యాజమాన్యం తమ అధికార వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ‘FILM-300o: porn’ పేరుతో సమ్మర్‌ క్లాసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. విద్యార్థులు కాలేజీ తరగతి గదిలో కూర్చొని పోర్న్‌ వీడియోలు చూస్తారు.  పోర్న్‌ను ‘ప్రయోగాత్మక, రాడికల్ ఆర్ట్ ఫారమ్’గా అన్వేషించే ప్రయత్నం చేస్తారంటూ వెబ్‌సైట్లో పేర్కొన్నారు.

అయితే ఈ ప్రకటన వివాదాస్పదమైంది. దీంతో కళాశాల యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తరగతులను కాలేజీలో కాకుండా బయట నిర్వహిస్తామని చీఫ్ మార్కెటింగ్ అధికారి షైలా రాప్పాజో యార్కిన్ వెల్లడించారు. వెబ్‌సైట్లోనూ ఈ మార్పులు చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే ఆ ప్రాంతాన్ని తెలియజేస్తామని పేర్కొన్నారు.

కాలేజీ ఈ తరహా ప్రకటనపై జోక్స్‌, మీమ్స్‌ వెల్లువెత్తాయి. అందుకేనా వెస్ట్‌మిన్‌స్టెర్‌ కళాశాలలో అడ్మిషన్‌కు అంత ఖర్చు? అంటూ ఓ నెటిజన్‌ చలోక్తులు విసిరాడు. తరగతిలో పోర్న్‌ చూడటం అసహ్యమైన పని అని మరో నెటిజన్‌ స్పందించాడు. ఇలాంటి కళాశాలల్లో మీ పిల్లలకు రక్షణ ఉండదంటూ మరికొందరు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని