Putin: యుద్ధాన్ని ముగించేందుకు.. ఉక్రెయిన్‌పై పుతిన్‌ అణుదాడి!

ఉక్రెయిన్‌పై రష్యా(Russia) అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం ఉందని యూఎస్‌ ఇంటిలిజెన్స్ నివేదిక అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇటీవల యూఎస్‌ కాంగ్రెస్‌కు సమర్పించిన ఈ నివేదికలో వార్షిక ముప్పు అంచనాలను పొందుపరిచింది.

Published : 11 Mar 2023 19:51 IST

మాస్కో: ఏడాదికాలంలో ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) జరుపుతోన్న సైనిక చర్యలో  విజయం ఎవరిపక్షమో స్పష్టత లేదు. తాను ప్రారంభించిన దాడిని గెలుపుతోనే ముగించాలని రష్యా భావిస్తుండగా.. అమెరికా(America), దాని మిత్రదేశాల సాయంతో ఉక్రెయిన్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎడతెగక జరుగుతోన్న ఈ దాడిని అణ్వస్త్రాల ప్రయోగంతో ముగించాలని రష్యా భావిస్తుందట. అలాగే తన దేశ ప్రజల మద్దతును తిరిగి పొందేందుకు ఈ యుద్ధంలోకి పశ్చిమ దేశాలను లాగే అవకాశం ఉందని యూఎస్‌ ఇంటిలిజెన్స్ నివేదిక అంచనా వేసింది.  

‘రష్యాను బలహీనపరిచేందుకు ఉక్రెయిన్‌ను అమెరికా ప్రాక్సీలా ఉపయోగిస్తోందని, ఉక్రెయిన్‌ మిలిటరీ విజయం.. యూఎస్, నాటో బలగాల జోక్యంతోనే సాధ్యమనే అభిప్రాయం ప్రచారంలో ఉంది. ఇది రష్యా నుంచి తీవ్ర స్పందనకు దోహదం చేయొచ్చు. ఈ యుద్ధం భౌగోళిక-రాజకీయ స్వరూపాన్ని మార్చుతోంది. చైనా-రష్యాకు పశ్చిమ దేశాలతో ఉన్న సమీకరణాలు మారుతున్నాయి. రష్యా, పశ్చిమ దేశాల మధ్య సైనికపరంగా పెరిగిన ఉద్రిక్తతల వల్ల ప్రపంచానికి ఎన్నడూ చూడని ప్రమాదం పొంచి ఉంది’ అని యూఎస్ నివేదిక పేర్కొంది. 

అమెరికన్‌ ఇంటెలిజెన్స్‌ కమ్యూనిటీ ఇటీవల యూఎస్‌ కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదికలో భాగంగా ఈ ముప్పు అంచనాలు వెలువరించింది. భారత్‌-పాకిస్థాన్‌, భారత్‌-చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఘర్షణలకు అవకాశం ఉందని కూడా ఈ నివేదిక అంచనా వేసిన సంగతి తెలిసిందే. సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ గతంలో కంటే దీటుగా సైనిక శక్తితో ప్రతిస్పందించగలదని అభిప్రాయపడింది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు