Ro Khanna: ‘ఇందుకోసమా మా తాత జైలుకెళ్లింది..?’: రాహుల్ అనర్హతపై యూఎస్ చట్టసభ్యుడు
రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై పడిన అనర్హత వేటుపై భారత సంతతికి చెందిన అమెరికా చట్టసభ సభ్యుడు రో ఖన్నా స్పందించారు. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వాషింగ్టన్: కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాగా ఈ పరిణామాలపై భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (Ro Khanna) స్పందించారు. ట్విటర్ వేదికగా ఈ అనర్హత వేటును ఖండించారు.
‘రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై వేటు వేయడం.. గాంధీ సిద్ధాంతాలకు, భారత దేశ విలువలకు తీవ్ర ద్రోహం చేయడమే అవుతుంది. మా తాతయ్య ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపింది దీని కోసం కాదు. భారత ప్రజాస్వామ్యం కోసం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం మీకు ఉంది’ అని అంటూ ప్రధాని నరేంద్రమోదీని ట్యాగ్ చేశారు. రాహుల్ అనర్హత గురించి న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రో ఖన్నా తాత అమర్‌నాథ్ విద్యాలంకార్.. భారత స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. స్వాతంత్ర్య సమరంలో ప్రముఖ పాత్ర పోషించిన లాలా లజపతి రాయ్‌తో కలిసి పనిచేశారు. ఈ క్రమంలో కొన్నేళ్లపాటు జైలు జీవితం గడిపారు.
కాగా, మోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష పడింది. దాంతో లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్ 8 ఏళ్లపాటు ఎన్నికలకు దూరంగా ఉండాల్సిందేనా? పైకోర్టులో అప్పీలు చేసుకుంటే అనర్హత వేటు తొలగిపోయే అవకాశాలేమైనా ఉన్నాయా? వంటి ప్రశ్నలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో ఇందూరు వాసి మృతి
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే
-
Ap-top-news News
YSRCP: లాగిపడేయండి.. సస్పెండ్ చేస్తా: అధికార పార్టీ కార్పొరేటర్‌పై మేయర్ వ్యాఖ్యలు
-
India News
Indian Railway Accidents: భారతీయ రైల్వేలో మహా విషాదాలివీ..
-
India News
Train Accidents: లాల్ బహదూర్ బాటలో... నడిచిన రైల్వే మంత్రులు వీరే