Flight: ప్రయాణికుడి వీరంగం.. విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తీయబోయి..!
విమానం (Flight)లో ఓ ప్రయాణికుడి భయానక చర్య మిగతా వారందరినీ ప్రమాదంలో పడేసింది. కొన్ని వేల అడుగుల ఎత్తులో విమానం గాల్లో ప్రయాణిస్తుండగా ఎమర్జెన్సీ డోర్‌ను తీయబోయాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు.
బోస్టన్: విమానం (Flight)లో ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించడం, అడ్డుకున్న సిబ్బందిపై దాడికి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికా (US)కు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమానం గాల్లో ఉండగా అత్యవసర ద్వారాన్ని (emergency door) తెరిచేందుకు యత్నించాడు. వద్దని చెప్పినందుకు సిబ్బందిపై ఏకంగా దాడికి పాల్పడ్డాడు. లాస్‌ఏంజిల్స్ నుంచి బోస్టన్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines) విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం..
గత ఆదివారం యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం లాస్‌ఏంజిల్స్ (Los Angeles) నుంచి బోస్టన్ (Boston) బయల్దేరింది. విమానం మరో 45 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా.. ఒక ఎమర్జెన్సీ డోర్ అన్‌లాక్ అయినట్లు కాక్‌పిట్‌లో అలారమ్ మోగింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆ ద్వారాన్ని తనిఖీ చేయగా.. డోర్ లాకింగ్ హ్యాండిల్‌ను ఎవరో లాగినట్లు కన్పించింది. దీంతో వెంటనే సిబ్బంది ఆ లాకింగ్‌ను సరిచేయడంతో పెను ప్రమాదం తప్పింది.
అయితే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ వద్ద కొంతసేపు ఉన్నాడని, అతడే దాన్ని తీసి ఉంటాడని ఓ సిబ్బంది.. కెప్టెన్‌కు సమాచారమిచ్చారు. అదే విషయం గురించి ఆ ప్రయాణికుడిని అడగ్గా.. అతడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. సిబ్బందిలో ఒకరి మెడపై తీవ్రంగా కొట్టడమే గాక.. పదునైన వస్తువుతో పొడిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులు గమనించి అతడిని అడ్డుకున్నారు. విమానం బోస్టన్‌లో దిగగానే విమాన సిబ్బంది ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో వారు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మసాచుసెట్స్‌కు చెందిన ఫ్రాన్సిస్కో సెవెరో టోరెస్‌గా గుర్తించారు.
ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines) స్పందించింది. తమ సిబ్బంది అప్రమత్తతతో విమాన ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు జరగలేదని తెలిపింది. హింసాత్మక ప్రవర్తనను తాము ఎన్నటికీ సహించబోమని పేర్కొన్న ఎయిర్‌లైన్స్.. నిందితుడి టోరెస్ భవిష్యత్తులో తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించినట్లు వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం