Ukraine Crisis: రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు భారత్‌కు ప్యాకేజీ..?

భారత్‌ ఆయుధాలు, సైనిక అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అమెరికా యత్నాలు మొదలు పెట్టనుంది. దీనిలో భాగంగా భారత్‌కు 500 మిలియన్‌ డాలర్లు

Published : 19 May 2022 02:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ ఆయుధాలు, సైనిక అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అమెరికా యత్నాలు మొదలు పెట్టనుంది. దీనిలో భాగంగా భారత్‌కు 500 మిలియన్‌ డాలర్ల విలువైన ప్యాకేజీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే అమెరికా నుంచి ఇటువంటి సాయం అత్యధికంగా పొందుతున్న దేశాల్లో ఒకటిగా భారత్‌ నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌, ఈజిప్ట్‌ ఇలాంటి సాయాలను పొందుతున్నాయి. ఈ డీల్‌ను ఎప్పుడు ప్రకటిస్తారు.. ఎటువంటి ఆయుధాలను సరఫరా చేస్తారు అనే అంశాలపై స్పష్టత రాలేదు.

జోబైడెన్‌ కార్యవర్గం భారత్‌ను దీర్ఘకాలిక భద్రతా భాగస్వామిగా నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలో ఈ ప్యాకేజీ కూడా భాగం. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ తటస్థవైఖరి అవలంభిస్తూ.. రష్యాను తప్పుపట్టలేదు. ఈ నేపథ్యంలో భారత్‌ పరిస్థితి అర్థం చేసుకొని ఆమెరికా చేపట్టిన చర్యల్లో ఇది ఒకటి.

దీర్ఘకాలంలో భారత్‌ను నమ్మకమైన భాగస్వామిగా చూడాలనే లక్ష్యంతో అమెరికా ఇతర దేశాలతో కూడా కలిసి పనిచేస్తోంది. ఫ్రాన్స్‌ వంటి దేశాలను ఈ క్రమంలో కలుపుకొని పోతోంది. భారత సైనిక అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకొంది. దీనిని మరింత వేగవంతం చేసేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భారీ ఆయుధాలైన ఫైటర్‌ జెట్లు, యుద్ధనౌకలు, ట్యాంకులు వంటి వాటిని ఇవ్వడంలో అమెరికాకు సవాళ్లు ఎదురుకానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని