Joe Biden: బైడెన్‌ కుమారుడు దోషే

తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ దోషిగా తేలారు.

Published : 12 Jun 2024 06:14 IST

తుపాకీ కొనుగోలు కేసులో నిర్ధారణ

విల్మింగ్టన్‌: తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ దోషిగా తేలారు. ఆయనపై మోపిన 3 అభియోగాల్లోనూ నేర నిర్ధారణ జరిగింది. మంగళవారం డెలావెర్‌లోని విల్మింగ్టన్‌ కోర్టు జడ్జి మేరీఎల్లెన్‌ నోరీకా హంటర్‌ నేరాన్ని నిర్ధారించారు. అయితే శిక్షా కాలాన్ని వెల్లడించలేదు. వాస్తవానికి ఇటువంటి కేసుల్లో 25ఏళ్ల వరకూ జైలు శిక్ష పడుతుంది. అయితే తొలిసారి నేరానికి పాల్పడినందున అంత కాలం శిక్ష పడకపోవచ్చని అంటున్నారు. నేరాన్ని నిర్ధారించిన జడ్జి.. ఎంత కాలం శిక్ష వేయనున్నారనేది వెల్లడించలేదు. ఎప్పటి నుంచి శిక్షను అమలు చేసేదీ చెప్పలేదు. తీర్పు వెలువరించిన వెంటనే హంటర్‌ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడే ఉన్న తన న్యాయవాదితోపాటు సతీమణి మెలిస్సా వద్దకు వచ్చి కౌగిలించుకున్నారు. విచారణ సందర్భంగా బైడెన్‌ సతీమణి, హంటర్‌ తల్లి జిల్‌ బైడెన్‌ కోర్టుకు వచ్చారు. తీర్పు వెలువరించిన తర్వాత భార్య, తల్లితో కలిసి హంటర్‌ కోర్టు నుంచి వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడలేదు. 

- తీర్పును అంగీకరిస్తున్నానని అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. ఈ కేసులో తాను కుమారుడి తరఫున క్షమాభిక్ష కోరబోనని స్పష్టం చేశారు. 

ఇదీ కేసు: 2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలరుకు ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్‌ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని, తనవద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. అయితే అది తప్పని తేలింది. అప్పటికే హంటర్‌ డ్రగ్స్‌ అక్రమంగా కొనుగోలు చేశారు. వాటికి బానిసగా మారారు. 11 రోజులపాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారు. 

- హంటర్‌పై మరో కేసు ఉంది. కాలిఫోర్నియాలో 1.4 మిలియన్‌ డాలర్ల పన్ను ఎగవేత కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. కాలిఫోర్నియా కోర్టులో సెప్టెంబరులో ఇది విచారణకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు