Vivek Ramaswamy: తమిళంలో మాట్లాడిన వివేక్‌ రామస్వామి.. వీడియో వైరల్

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారతీయ సంతతి వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే.. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated : 27 Sep 2023 13:32 IST

వాషింగ్టన్: రిపబ్లికన్‌ పార్టీ (Republican) తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) దూసుకెళ్తున్నారు. ఇందు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే.. తాజాగా వివేక్‌ తన మద్దతుదారులతో తమిళంలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ‘సాధారణంగా మనం భిన్నత్వాన్ని చూపించాలనుకుంటాం. కానీ మనమందరం ఒక్కటే అనే విషయాన్ని మరిచిపోతాం’ అంటూ ఓ వీడియోను తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

వీడియోలో వివేక్‌ రామస్వామిని కలిసిన వ్యక్తి ఆయనతో మాట్లాడుతూ..‘ మిమ్మల్ని అడగడానికి నా దగ్గర ఎలాంటి ప్రశ్నలు లేవు. కానీ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మిమ్మల్ని అమెరికా అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నాను. నేను తమిళనాడులోని వేలూరు నుంచి వచ్చాను’ అని చెప్పాడు. దాంతో వివేక్‌ అతడికి ‘నేను కూడా తమిళంలో మాట్లాడతాను’ అని తమిళంలోనే సమాధానమిచ్చారు. తన తమిళ్‌ ఎక్కువగా పాలక్కాడ్‌లో మాట్లాడే మాండలికంలో ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

దీంతో భారతీయులు ఆయనకు సానుకూలంగా కామెంట్లు పెడుతున్నారు.  ‘వివేక్‌ అమెరికా అధ్యక్షుడిగా సరిపోతారు. ఆల్‌ ది బెస్ట్’ ‘ ఆయన తన మూలాలను మరిచిపోలేదు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా ఎటువంటి తారతమ్యం లేకుండా అందరినీ కలుపుకొని మాట్లాడుతున్నారు. ఇదే కదా భారతీయ వ్యక్తితం’ అంటూ రాసుకొచ్చారు. రామస్వామి తల్లిదండ్రులు కేరళ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని