US Secret Service: అమెరికా అధ్యక్షుడి పర్యటన.. భద్రతా సిబ్బందిని దోచుకొన్న దొంగలు

ప్రపంచంలోనే అత్యంత సుశిక్షత భద్రతా సిబ్బంది అమెరికా అధ్యక్షుడి ‌ వద్ద విధులు నిర్వహిస్తారు. అలాంటి సిబ్బందినే కాలిఫోర్నియాలో దోచుకొన్నారు.

Published : 18 Jun 2024 12:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత సుశిక్షత భద్రతా సిబ్బందిలో అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం ఒకటి.  అమెరికా అధ్యక్షుడికి భద్రత కల్పించడం దీని ప్రధాన విధి. అలాంటి బృందంలోని ఓ సభ్యుడిని అధ్యక్షుడి అధికారిక పర్యటన జరిగిన వేళ దొంగలు బెదిరించి దోచుకొన్నారు. ఈ ఘటనలో లాస్‌ ఏంజెల్స్‌లో చోటు చేసుకొంది.      

ఇటీవల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, మాజీ అధ్యక్షుడు ఒబామా కలిసి లాస్ఏంజెల్స్‌లో ఓ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నుంచి తిరిగి వెళుతున్న ఓ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ను టూస్టిన్‌  అనే ప్రాంతంలో తుపాకీతో బెదిరించి అతని వద్దనున్న బ్యాగ్‌ను దోచుకొన్నారు.  ఈ సమయంలో ఆ ఏజెంట్‌ కూడా కాల్పులు జరిపాడు.  కానీ, ఎవరైనా గాయపడ్డారా అన్న విషయం తెలియలేదు. ఆ తర్వాత ఈ ఘటనపై టూస్టిన్‌ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొన్నారు. 

మరోవైపు సీక్రెట్‌ సర్వీస్‌ ప్రతినిధి ఆంటోనీ గుగ్లెమొనీ స్పందిస్తూ..‘మా సిబ్బంది ఒకరు కాలిఫోర్నియాలో దోపిడీకి గురయ్యారు.  ఈ ఘటనలో అతడు  తన సర్వీస్‌ గన్‌తో ఫైరింగ్‌ కూడా చేశాడు. దుండగుల కోసం గాలిస్తున్నాం’ అని పేర్కొన్నారు.  దోపిడీ జరిగిన ప్రదేశం నుంచి ఓ కారు వేగంగా వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని