Russia: అణుదాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవల సైనిక సమీకరణ ప్రకటన చేసిన నాటి నుంచి పశ్చిమ దేశాల్లో అణుభయాలు పెరిగిపోయాయి. ఉక్రెయిన్‌ యుద్ధ భూమిలో ఓటమి తప్పించుకోవడానికి రష్యా చిన్న

Published : 26 Sep 2022 10:28 IST

* రష్యాకు హెచ్చరికలు పంపిన అమెరికా

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవల సైనిక సమీకరణ ప్రకటన చేసిన నాటి నుంచి పశ్చిమ దేశాల్లో అణుభయాలు పెరిగిపోయాయి. ఉక్రెయిన్‌ యుద్ధ భూమిలో ఓటమి తప్పించుకోవడానికి రష్యా చిన్నసైజు టాక్టికల్‌  అణు బాంబును వాడొచ్చనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ప్రైవేటుగా ఓ సందేశం రష్యాకు చేరింది. రష్యా అణు యుద్ధం మొదలుపెడితే తీవ్ర పరిణామాలు తప్పవని ఈ సందేశంలో పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ ధ్రువీకరించారు. ‘‘మేము రష్యన్లతో బహిరంగంగా ఎలా ఉంటామో.. ప్రైవేటుగా కూడా అలానే ఉంటాం. అణ్వాయుధాలపై అనవసరంగా మాట్లాడటం తగ్గించుకోవాలని సూచించాం. అణ్వాయుధం వినియోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మాస్కో తెలుసుకోవాలి. అణ్వాయుధం ప్రయోగించిన దేశం కూడా ఆ పరిణామాలు అనుభవించాల్సి ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పాం’’ అని బ్లింకన్‌ పేర్కొన్నారు.

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సులెవాన్‌ కూడా ఇలాంటి హెచ్చరికలే చేశారు. ఆయన ఓ ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘‘అమెరికా, మిత్రదేశాలు నిర్ణయాత్మకంగా స్పందిస్తాయి. మేము ఎలా స్పందించాలనే దానిపై స్పష్టమైన వ్యూహంతో ఉన్నాం’’ అని వెల్లడించారు.

ఇటీవల ఐరాస సర్వసభ్య సమావేశంలో రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ మాట్లాడారు. పుతిన్‌ వ్యాఖ్యలపై మాట్లాడుతూ తమ వ్యూహ పత్రంలో దాపరికం ఏమీ లేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని