US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!

అమెరికా(America)కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు డబ్బు ఖర్చుపెట్టడం ఇష్టముండదట. అందుకే దాచిన డబ్బుతో 35 ఏళ్లకే పదవీ విరమణ చేయాలనుకుంటున్నాడు.

Updated : 02 Apr 2023 11:19 IST

వాష్టింగన్‌: ఈ ద్రవ్యోల్బణ సమయంలో ఖర్చులు పోను జీతం మిగలడమే చాలామందికి కష్టంగా మారింది. కానీ యూఎస్‌(America)కు చెందిన 29 ఏళ్ల టాన్నర్‌ ఫర్ల్‌ అనే వ్యక్తికి మాత్రం డబ్బులు ఖర్చు పెట్టడమంటే అలర్జీ అట. అందుకే  ఈ వయసుకే అతడు రూ.3 కోట్లు సేవ్‌ చేయగలిగాడు. 

మిన్నియాపోలిస్‌ ప్రాంతంలో నివసించే టాన్నర్‌కు వివాహమైంది. తనలాగే తన భార్యకు కూడా డబ్బు ఖర్చుపెట్టడమంటే ఇష్టముండదట. కేవలం అవసరాలకు మాత్రమే దానిని వెచ్చిస్తామని చెప్పాడు. ఇక అతడు ఫైర్‌ మూవ్‌మెంట్‌లో భాగమయ్యాడు. అంటే ఆర్థిక స్వావలంబన పొంది చిన్నవయస్సులో పదవీ విరమణ పొందడం(Financial Independence Retire Early) దాని ఉద్దేశం. ప్రస్తుతానికి రూ. 3 కోట్లు దాచిపెట్టిన అతడు .. 35 ఏళ్ల వయస్సు వచ్చేసరికి దానిని రూ. 5కోట్లకు పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగ విరమణ చేయాలని భావిస్తున్నాడు.

ప్రస్తుతం అతడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఏడాదికి కోటి రూపాయల ఆదాయం వస్తోంది. దాంతో అతడు.. భార్య, ఒక కుమారుడు, మూడు పిల్లులను పోషిస్తున్నాడు. తన ఖర్చులు పోనూ మిగిలిన దానిని మదుపు చేస్తున్నాడు. తాను పెరిగిన కుటుంబ వాతావరణం వల్ల టాన్నర్‌కు చిన్నతనంలోనే డబ్బు విలువ తెలిసిందట. అందుకే సేవింగ్స్‌కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానని చెప్పాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు