Ukraine Crisis: యూరప్‌ బయల్దేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు యూరప్‌ పర్యటన చేపట్టారు.  

Published : 24 Mar 2022 01:29 IST

అమెరికా: ఉక్రెయిన్‌కు మద్దతుగా అంతర్జాతీయ సమాజం మద్దతును కూడగట్టేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రంగంలోకి దిగారు. యుద్ధంతో ఉక్రెయిన్‌కు తీవ్ర నష్టం కలిగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తగిన ఆర్థిక మూల్యం చెల్లించేలా చూసేందుకు తాను యూరప్‌కు వెళ్తున్నట్టు పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు యూరప్‌లో పర్యటించనున్న బైడెన్‌.. రష్యా దండయాత్ర నేపథ్యంలో తన కీలక మిత్రదేశాలతో చర్చలు జరపనున్నారు. పర్యటనకు ముందు బైడెన్‌ మీడియాతో మాట్లాడారు. రష్యా రసాయన ఆయుధాలతో ఉక్రెయిన్‌పై దాడులకు దిగే అవకాశం ఉందన్నారు. ఉక్రెయిన్‌ బలగాలు తీవ్ర ప్రతిఘటన, లాజిస్టిక్‌ సమస్యల నేపథ్యంలో రష్యా అణ్వాయుధాలు లేదా రసాయన ఆయుధాలు ప్రయోగించే భయాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని