Antibiotics: బాల్యంలో శిశువులకు యాంటీబయాటిక్‌ ఔషధాలను ఎక్కువగా ఇస్తే..?

శిశువులకు యాంటీబయాటిక్‌ ఔషధాలను ఎక్కువగా ఇస్తే.. పెద్దయ్యాక వారిలో పేగుల సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తే ముప్పు అధికంగా ఉంటుందని ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చారు. తక్కువ

Updated : 10 Sep 2022 09:53 IST

మెల్‌బోర్న్‌: శిశువులకు యాంటీబయాటిక్‌ ఔషధాలను ఎక్కువగా ఇస్తే.. పెద్దయ్యాక వారిలో పేగుల సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తే ముప్పు అధికంగా ఉంటుందని ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చారు. తక్కువ బరువుతో, నెలలు నిండక ముందే జన్మించే పిల్లల్లో ఇన్‌ఫెక్షన్ల నివారణ/చికిత్స కోసం వైద్యులు యాంటీబయాటిక్‌ మందులను ఇస్తుంటారు.  చాలా చిన్న వయసులోనే ఆ ఔషధాల ప్రభావానికి గురవుతుండటంతో.. పెద్దయ్యాక వారి పేగుల్లో మేలుదాయక సూక్ష్మజీవులు నశిస్తున్నాయని, ఆహార కదలికలపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోందని పరిశోధకులు నిర్ధారించారు. డయేరియా వంటి లక్షణాలు ఎక్కువగా తలెత్తుతున్నాయనీ గుర్తించారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని