Shehbaz Sharif: పాక్‌ నయా ప్రధాని షహబాజ్‌ కోపం చూస్తే వామ్మో! అనక మానరు

పాకిస్థాన్‌ నూతన ప్రధాని షెహబాజ్‌ పలు సందర్భాల్లో కోపంతో ఊగిపోయిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.........

Published : 12 Apr 2022 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ రాజకీయం ఆసక్తి రేపుతోంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆ దేశ ప్రధానిగా పీఎంఎల్‌ (ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ (70) తాజాగా ఎన్నికయ్యారు. షెహబాజ్‌కు పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ప్రధాని ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. పీటీఐ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న షా మెహమ్ముద్‌ ఖురేషీ ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రధానమంత్రిగా షెహబాజ్‌కు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే.. షెహబాజ్‌ పలు సందర్భాల్లో కోపంతో ఊగిపోయిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. మాట్లాడే సమయంలో ఆయన చేతి సంజ్ఞలు, కోపంతో పోడియంను కొట్టే తీరుపై ఇంటర్నెట్‌లో చర్చ సాగుతోంది.

రోసీ అనే ట్విటర్‌ యూజర్‌ తాజాగా ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో షెహబాజ్‌ షరీఫ్‌ పలు సందర్భార్లో కోపంతో ఊగిపోయారు. పీఎంఎల్‌ (ఎన్‌) నేత ఉద్వేగంగా మాట్లాడే విధానం.. ముఖ్యంగా ఆ సందర్భంలో చేతి సంజ్ఞలు.. మైక్‌లకు విసిరేసినంత పనిచేసి కోపంతో వేదికపై నుంచి వెళ్లిపోయే తీరు చూసిన నెటిజన్లు ఇదేం కోపంరా నాయనా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరైతే అర్ణబ్‌ గోస్వామితో పోలుస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు మిలియన్‌ మంది వీక్షించారు. షెహబాజ్‌ ప్రస్తుతం ప్రధాని పదవి చేపట్టడంతో ఆయన హావభావాలపై నెటిజన్లు మీమ్స్‌ సృష్టిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని