Mike Tyson: ప్రయాణికుడి అతి.. పిడిగుద్దులు కురిపించిన మైక్ టైసన్
దిగ్గజ బాక్సర్, మాజీ ఛాంపియన్ మైక్ టైసన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.......
ఇంటర్నెట్ డెస్క్: దిగ్గజ బాక్సర్, మాజీ ఛాంపియన్ మైక్ టైసన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విమానంలో తోటి ప్రయాణికుడిపై అతను పిడిగుద్దుల వర్షం కురిపించాడు. కోపంతో పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ దెబ్బకు బాధితుడి మొహం నుంచి రక్తం చిందింది. అమెరికా శాన్ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్లే విమానంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
అయితే తన సీట్లో ప్రశాంతంగా కూర్చున్న మైక్ టైసన్‌ను వెనక సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు బాగా ఇబ్బంది పెట్టినట్లు సదరు వీడియోలో కనిపిస్తోంది. టైసన్‌కు పలుమార్లు చిరాకు తెప్పించడమే కాకుండా.. వాటర్ బాటిల్‌ను సైతం అతనిపైకి విసిరినట్లు సమాచారం. దీంతో కోపోద్రిక్తుడైన ఈ బాక్సింగ్ దిగ్గజం సీట్లోనుంచి లేచి వెనకాల ఉన్న వ్యక్తిని చితకబాదాడు. బాధితుడి మొహం నుంచి రక్తం వచ్చినట్లు కూడా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దాదాపు 60లక్షల మంది వీక్షించారు. అయితే ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించడం వల్లే ఇలా జరిగిందని మైక్ టైసన్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు.
ఘటనపై సమాచారం అందగానే పోలీసులు ఫ్లోరిడా విమానాశ్రయానికి వెళ్లారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు సదరు యువకుడు నిరాకరించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఇద్దరినీ విడిచిపెట్టామని, తదుపరి విచారణ ఇంకా జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ఘటన సమయంలో విమానంలో ఉన్న సారా బుర్చ్ఫీల్డ్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టైసన్ చేతిలో దెబ్బలుతిన్న వ్యక్తిని ముందుగా విమానాశ్రయంలోని బార్లో చూశానని.. అతను తాగి ఉన్నాడని పేర్కొన్నారు. బిగ్గరగా అరుస్తూ గోల చేశాడని వివరించారు. మొదట టైసన్, ఆ వ్యక్తి మాట్లాడుకున్నారని, ఆ తర్వాత కాసేపటికే ఇద్దరి మధ్య గొడవ జరిగిందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్‌లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్‌పై దాడుల పరంపర
ఉక్రెయిన్‌లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్‌ఫోర్డ్‌లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్‌తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్‌కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ