Published : 28 Jun 2022 02:09 IST

Viral Video: బోరిస్‌ జాన్సన్‌ను వెంబడించిన పోలీసులు.. అసలేమయ్యింది..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేక్షకులతో భారీగా నిండిఉన్న క్రికెట్‌ స్టేడియంలో.. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను (Boris Johnson) ఓ పోలీసుల బృందం ఛేజ్‌ చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జాన్సన్‌ పరిగెడుతుండగా.. దాదాపు 10మంది సభ్యులుగల పోలీసు బృందం ఆయనను వెంబడిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది.. అయితే ఆ వీడియోలో ఉన్నది బోరిస్‌ జాన్సన్‌ కాదు.. అచ్చం ఆయన వేషధారణలో ఉన్న సాధారణ పౌరుడు. ఆయనను వెంబడించింది కూడా నిజమైన పోలీసులు కాదు.. వారూ సాధారణ పౌరులే. ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌ మధ్య లీడ్స్‌లోని హీడింగ్లే మైదానంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

కొవిడ్‌-19 నిబంధనలు ఉల్లంఘించి.. ప్రభుత్వంలోని నేతలు, అధికారులతో కలిసి ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మద్యం విందులో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ‘పార్టీగేట్‌’ కుంభకోణంగా (Partygate scandal) పిలిచే ఈ విందులపై జాన్సన్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో పార్లమెంట్‌ వేదికగా ప్రధాని క్షమాపణ చెప్పారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి, ముందుకు కదులుదామని, ప్రభుత్వ ప్రాధాన్యతలపై దృష్టి పెడదామని పేర్కొన్నారు.

కానీ ప్రజలు, సొంతపార్టీ నేతలే ఆయనను వ్యతిరేకించారు. ఈనెల మొదటివారంలో సొంత పార్టీ (కన్జర్వేటివ్ పార్టీ) సభ్యుల నుంచే విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. కానీ స్వల్ప ఓట్ల తేడాతో నెగ్గి బతికిపోయారు. బ్రిటన్‌ సింహాసనాన్ని క్వీన్‌ ఎలిజబెత్‌-2 అధిష్ఠించి 70 ఏళ్లవుతున్న సందర్భంగా లండన్‌లో నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరైన ఆయన భంగపాటుకు గురయ్యారు. కొంతమంది పరుష పదజాలంతో హేళన చేశారు. వెకిలిగా మాట్లాడారు. తాజాగా క్రికెట్‌ మైదానంలో జరిగిన ఈ ఘటన సైతం జాన్సన్‌కు వ్యతిరేకంగా చేపట్టినట్లుగానే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే 5.2లక్షల మందికి పైగా వీక్షించారు.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని