Ukraine Crisis: ఇటు బ్రిక్స్ సహకారానికి పుతిన్ పిలుపు.. అటు ఇజ్రాయెల్‌పై జెలెన్స్కీ గరం గరం!
కీవ్‌కు అండగా నిలుస్తోన్న పశ్చిమ దేశాల స్వార్థపూరిత చర్యలను ఎదుర్కొనేందుకు సహకరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిక్స్ దేశాల నేతలకు పిలుపునిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కీవ్‌కు అండగా నిలుస్తున్న పశ్చిమ దేశాల స్వార్థపూరిత చర్యలను ఎదుర్కొనేందుకు సహకరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల నేతలకు పిలుపునిచ్చారు. గురువారం వర్చువల్ వేదికగా నిర్వహించిన బ్రిక్స్ (BRICS) 14వ శిఖరాగ్ర సమావేశంలో ఆయన ప్రసంగించారు. రష్యా (Russia)పై ఆంక్షలను ఉటంకిస్తూ.. ‘కొన్ని దేశాల దుష్ప్రవర్తన, స్వార్థపూరిత చర్యల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం ఏర్పడింది. నిజాయతీ, పరస్పర ప్రయోజనకర విధానాలతో మనం ఈ స్థితి నుంచి బయటపడగలం’ అని వ్యాఖ్యానించారు. పరస్పర సంబంధాలు మెరుగుపడేలా, బహుముఖ వ్యవస్థ స్థాపించేలా.. ‘బ్రిక్స్’ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పుతిన్ అన్నారు.
మరోవైపు.. రష్యాపై ఆంక్షల విధింపునకు ఇజ్రాయెల్ ముందుకు రాకపోవడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి తప్పుపట్టారు. జెరూసలేంలోని హిబ్రూ యూనివర్సిటీ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిరాకరణపై మాట్లాడుతూ.. దురాక్రమణకు గురవుతున్న ఓ బాధిత దేశాన్ని ఎందుకు ఆదుకోలేరు? అని ప్రశ్నించారు. యుద్ధ సమయంలో రష్యాకు.. ఇజ్రాయెల్ ఏ విధంగా సహాయపడుతోందంటూ వస్తున్న ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదన్నారు. ఇజ్రాయెల్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ.. జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. త్వరలో ఇక్కడి నఫ్తాలి బెన్నెట్ నేతృత్వంలోని ప్రభుత్వం రద్దు కానున్న విషయం తెలిసిందే. బెన్నెట్ రష్యా దండయాత్రను బహిరంగంగా విమర్శించలేదు. ఇరు దేశాలతోనూ ఇజ్రాయెల్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. -
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్‌లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్‌లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్‌పై దాడుల పరంపర
ఉక్రెయిన్‌లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్‌ఫోర్డ్‌లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్‌తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు