Ukraine Crisis: ఉక్రెయిన్‌ నాయకత్వాన్ని కూలదోయండి: సైన్యానికి పుతిన్‌ పిలుపు

ఓ వైపు ఉక్రెయిన్‌ అధికారులతో చర్చలకు సిద్ధమని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరో వైపు ఆదేశ సైన్యానికి కీలక సూచనలు చేశారు. ఉక్రెయిన్‌ నాయకత్వాన్ని కూలదోయాలని పిలుపునిచ్చారు. అక్కడి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని సూచించారు..

Updated : 25 Feb 2022 22:28 IST

మాస్కో: ఓ వైపు ఉక్రెయిన్‌ అధికారులతో చర్చలకు సిద్ధమని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరో వైపు ఆదేశ సైన్యానికి కీలక సూచనలు చేశారు. ఉక్రెయిన్‌ నాయకత్వాన్ని కూలదోయాలని పిలుపునిచ్చారు. అక్కడి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని సూచించారు. ఉక్రెయిన్‌ నాయకత్వాన్ని ఉగ్రవాదులు, డ్రగ్స్‌ ముఠాగా పేర్కొన్నారు. అక్కడి నాయకత్వాన్ని అభినవ నాజీలుగా అభివర్ణించారు. ఓ టీవీ ఛానల్‌ ద్వారా ఆయన  మాట్లాడుతూ.. ‘‘ఉక్రెయిన్‌లోని మిలటరీ సిబ్బందికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. నయా నాజీలకు మానవ కవచాలుగా మీ పిల్లలు, భార్యలు, పెద్దలను ఉండనీయొద్దు. అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి’’ అని ఉక్రెయిన్‌ సైనికులకు పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని