Putin: మేరియుపోల్‌లో పుతిన్ పర్యటన.. ఉక్రెయిన్ యుద్ధంలో నాశనమైన నగరం
రష్యా దాడితో వినాశనమైన మేరియుపోల్‌లో (Ukraine Crisis) అధ్యక్షుడు పుతిన్ పర్యటించారు. క్రిమియాలో పర్యటనలో ఉన్న ఆయన (Putin) యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది.
కీవ్: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దురాక్రమణ (Ukraine Crisis) మొదలుపెట్టిన రష్యా.. అనేక నగరాల్లో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తీర ప్రాంతమైన మేరియుపోల్‌నూ పూర్తిగా నాశనం చేసింది. మరుభూమిగా మారిన ఆ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) ఆకస్మిక పర్యటన చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం ముగిసిన తర్వాత ఆక్రమిత భూభాగాల్లో పుతిన్ పర్యటించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా క్షిపణి దాడులు చేస్తోన్న సమయంలోనే పుతిన్ మేరియుపోల్‌కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మేరియుపోల్‌కు హెలికాప్టర్‌లో వెళ్లిన పుతిన్.. నగరంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. అంతేకాకుండా అక్కడక్కడ ఆగుతూ స్థానికులతో మాట్లాడినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌పై భీకర దాడులు మొదలుపెట్టిన తర్వాత తొలిసారి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో పుతిన్ పర్యటించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ గతంలో ఆక్రమించుకున్న క్రిమియాలో ఇటీవల ఆకస్మిక పర్యటన చేశారు. రష్యాలో ఈ ప్రాంతం విలీనమై తొమ్మిదేళ్లయిన సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన ఒక బాలల కేంద్రాన్ని సందర్శించారు. మరోవైపు ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించారంటూ పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆయనకు అరెస్టు వారెంటు జారీ చేసింది. అయితే భద్రతా కారణాలరీత్యా క్రిమియాను తమ ఆధీనంలో ఉంచుకోవడం అనివార్యమని పుతిన్ చెబుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rent a girl friend: అద్దెకు గర్ల్‌ఫ్రెండ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్...
-
India News
దేవుడా.. ఈ బిడ్డను సురక్షితంగా ఉంచు: భూప్రకంపనల మధ్యే సి-సెక్షన్ చేసిన వైద్యులు..!
-
Politics News
AP News: ఎవరి అంతరాత్మ ఎలా ప్రబోధిస్తుందో?.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి
-
Sports News
IND vs AUS: భారత్, ఆసీస్ మూడో వన్డే.. ఆలౌటైన ఆస్ట్రేలియా
-
India News
Modi: JAM-జన్‌ధన్, ఆధార్, మొబైల్.. ప్రపంచానికే ఓ కేస్‌స్టడీ
-
Crime News
Vijayawada: విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న రూ.7.48కోట్ల విలువైన బంగారం పట్టివేత