Volcano: సముద్ర గర్భంలో పేలిన అగ్నిపర్వతం.. పలు దేశాలకు సునామీ హెచ్చరికలు!

దక్షిణ పసిఫిక్‌ సముద్రంలోని ద్వీపకల్పం టోంగాలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. అక్కడి సముద్ర గర్భంలోని అగ్ని పర్వతం శనివారం బద్ధలవడంతో భారీ ఎత్తున పొగ, బూడి ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. టోంగాపై అలలు విరుచుకుపడుతున్నాయి. సముద్రంలో అలలు

Published : 17 Jan 2022 01:28 IST

నుకులోఫాలో: దక్షిణ పసిఫిక్‌ సముద్రంలోని ద్వీపకల్పం టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. టోంగా రాజధాని నుకులోఫాలోకి 65కి.మీ దూరంలో సముద్ర గర్భంలో ఉన్న అగ్ని పర్వతం(టోంగా హుంగా హాపై) శనివారం ఒక్కసారిగా బద్ధలవడంతో టోంగా వ్యాప్తంగా పొగ, బూడిద ఎగిసిపడ్డాయి. సముద్ర గర్భం నుంచి బయటకొచ్చిన బూడిద 20కి.మీ వరకు ఎగిసిపడ్డట్లు టోంగా జియోలాజికల్‌ సర్వే సంస్థ తెలిపింది. అగ్నిపర్వతం పేలుడు శబ్దాలు 8 నిమిషాలపాటు వినిపించినట్లు పేర్కొంది. మరోవైపు పేలుడు ధాటికి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో టోంగాతోపాటు జపాన్‌, ఫిజీ, హవాయి, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, చిలీ, అలస్కాసహా యూఎస్‌ పశ్చిమ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియాకు కూడా అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు చేసింది. తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. 

అగ్నిపర్వత విస్ఫోటనం.. భూకంప తీవ్రతతో పోలిస్తే రిక్టర్‌ స్కేలుపై 5.8గా ఉంటుందని అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. విస్ఫోటనం ధాటికి జపాన్‌ పసిఫిక్‌ కోస్టల్‌ ప్రాంతంలో అలలు 1.2 మీటర్ల ఎత్తు ఎగిసిపడ్డాయని అక్కడి వాతావారణ శాఖ తెలిపింది. టోంగాకు 2,300 కి.మీ దూరంలో ఉన్న న్యూజిలాండ్‌పై కూడా దీని ప్రభావం పడింది. అలలకు అక్కడి తీర ప్రాంతంలో ఉన్న పడవలు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన అక్కడి అధికారులు తీరప్రాంతంలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని