mountain Huascaran: పర్వతారోహణకు వెళ్లి అదృశ్యం..22 ఏళ్ల తర్వాత చెక్కుచెదరని స్థితిలో మృతదేహం లభ్యం

22ఏళ్ల క్రితం పెరూలోని హుస్కరన్ పర్వతారోహణకు వెళ్లి అదృశ్యమైన ఓ వ్యక్తి మృతదేహం ఇటీవల బయటపడింది.

Published : 09 Jul 2024 13:53 IST

పెరూ: 22ఏళ్ల క్రితం పర్వతారోహణకు వెళ్లి అదృశ్యమైన ఓ అమెరికా పర్వతారోహకుడి మృతదేహం ఇటీవల బయటపడింది. ఈ ఘటన పెరూ(Peru)లో చోటుచేసుకుంది. వాతావరణంలో మార్పుల కారణంగా మంచు కరిగిపోవడంతో అతడి మృతదేహం బయటపడిందని పోలీసులు పేర్కొన్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2002లో అమెరికాకు చెందిన విలియం స్టాంప్‌ఫ్ల్(59) అనే పర్వతారోహకుడు పెరూలోని హుస్కరన్(Huascaran) పర్వతాన్ని అధిరోహించారు. దీని ఎత్తు 6,700 మీటర్లు (22,000 అడుగులు). పర్వతం ఎక్కుతుండగా, కొంతసేపటి తరువాత అతడు అదృశ్యమయ్యాడు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా అతని ఆచూకీ దొరకలేదు. దీంతో పర్వతారోహకుడి కుటుంబం అతడిపై ఆశలు వదులుకుంది. కాగా తాజాగా వాతావరణంలో మార్పుల వల్ల పర్వతం మీద ఉన్న మంచు కరుగుతూ వస్తోంది. అలా కరుగుతున్న సమయంలో 22ఏళ్ల క్రితం అదృశ్యమైన పర్వతారోహకుడి మృతదేహం బయటపడింది.

అయితే ఇన్నేళ్లు పర్వతారోహకుడి శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో అతడి శరీరం మునుపటిలానే ఉంది. ఒంటిపైన ఉన్న దుస్తులు, షూ, పాస్‌పోర్ట్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. మృతదేహం వద్ద దొరికిన పాస్‌పోర్ట్‌ ఆధారంగా వారి కుటుంబసభ్యులను సంప్రదించామని, మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని పోలీసులు పేర్కొన్నారు.  

ఈశాన్య పెరూలోని హుస్కరన్, కాషాన్ వంటి పర్వతాలను దేశీయ, విదేశీ పర్వతారోహకులు అధిరోహిస్తుంటారు. కాగా ఇటీవల ఇజ్రాయెల్‌, ఇటలీకి చెందిన ఇద్దరు పర్వతారోహకులు హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తూ మృతి చెందారు. 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు