Ukraine Crisis: ఉక్రెయిన్‌ చేతికి మరో 20 యుద్ధ విమానాలు ..!

డాన్‌బాస్‌ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌ విజయం సాధించేలా చేసేందుకు పశ్చిమ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో భారీ ఆయుధాలను సమకూర్చేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా ఉక్రెయిన్‌కు మరో 20

Published : 22 Apr 2022 01:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డాన్‌బాస్‌ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌ విజయం కోసం పశ్చిమ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో భారీ ఆయుధాలను సమకూర్చేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా ఉక్రెయిన్‌కు మరో 20 యుద్ధవిమానాలు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. విడిభాగాల సరఫరాలు, మరమ్మతులు వేగవంతం చేయడం ఉక్రెయిన్‌కు కలిసొచ్చింది. ఈ సారి హెలికాప్టర్లను కూడా ఇవ్వనున్నట్లు పెంటగాన్‌ సిబ్బంది వెల్లడించారు. 

ఇటీవల బైడెన్‌ ప్రకటించిన 800 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయంతో ఉక్రెయిన్‌కు అందే ఆయుధాల సంఖ్య, స్థాయి భారీగా పెరిగిపోయినట్లు పేర్కొన్నారు. 40,000శతఘ్ని గుండ్లు, శతఘ్నులు, 11 ఎంఐ-17 హెలికాప్టర్లు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి. మొదట్లో పశ్చిమ దేశాలు ఆయుధ సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. రష్యా డాన్‌బాస్‌ ప్రాంతంపై దృష్టిపెట్టడంతో యుద్ధరీతి మొత్తం మారిపోయింది. పూర్తిగా కొత్త విధానంలో యుద్ధం మొదలైనట్లు పెంటగాన్‌ ప్రెస్‌ సెక్రటరీ జాన్‌ కెర్బీ అంగీకరించారు. 

మరోపక్క జర్మనీ కూడా యాంటీ ట్యాంక్‌ ఆయుధాలు, స్టింగర్‌ క్షిపణులతోపాటు మరికొన్ని రహస్య ఆయుధాలు కూడా అందజేస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అన్నాలెనా బేర్‌బ్యాక్‌ పేర్కొన్నారు. మరోపక్క బ్రిటన్‌ కూడా 130 మిలియన్‌ డాలర్లు విలువైన ఆయుధాలు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇక నార్వే 100 మిస్ట్రల్‌ షార్ట్‌ రేంజి ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థను అందించడానికి సిద్ధంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని