Published : 15 May 2022 01:42 IST

WHO: రెండేళ్లు దాటినా.. మహమ్మారి అత్యవసర దశ ముగియలేదు..!

జెనీవా: ఈ ప్రపంచంలోకి కరోనా అడుగుపెట్టి రెండేళ్లు దాటిపోయింది. పలు దేశాల్లో బూస్టర్‌ డోసుల పంపిణీ కూడా జరుగుతోంది. మనదేశంలో మూడోవేవ్‌ అంతగా ప్రభావం చూపలేకపోయింది. అయినా సరే, కరోనా తీవ్ర దశ ముగిసిందని చెప్పలేమంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ‘మనం ఒకరితో ఒకరం అనుసంధానమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. కొన్ని దేశాలు మహమ్మారి అత్యవసర దశను ముగించగలిగి ఉండొచ్చు. కానీ, అన్ని దేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో దీనిపై మన పోరాటం కొనసాగించాలి’ అంటూ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 

అలాగే 50కి పైగా దేశాల్లో కేసులు పెరుగుతోన్న విషయాన్ని తన వారాంతపు నివేదికలో పేర్కొంది. వాక్సినేషన్ మెరుగ్గా జరిగిన దేశాల్లో ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు తక్కువగా ఉన్నాయని చెప్పింది. వ్యాక్సినేషన్ స్థాయులు తక్కువగా ఉన్న దగ్గర మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పేద దేశాల్లో 16 శాతం మంది అర్హులకే టీకా అందిందని తెలిపింది. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికాలో గత మూడు వారాల్లో కరోనా కేసులు నాలుగు రెట్లు పెరిగాయని, మరణాలు రెట్టింపయ్యాయని ఆరోగ్య సంస్థ ఆఫ్రికా విభాగం వెల్లడించింది. అయితే గత వేవ్‌తో పోల్చుకుంటే ఆసుపత్రిలో చేరికలు 20 శాతమేనంది. ప్రస్తుతం బీఏ.4, బీఏ.5 (ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్లు) ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. వాటిలో చోటుచేసుకున్న ఉత్పరివర్తనలే అందుకు కారణమని చెప్పింది. 

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts