WHO: కొవిడ్ మూలాల గురించి మీకు తెలిసింది చెప్పండి..!
కరోనా(Coronavirus) మూలం ఇప్పటికీ మిస్టరీనే. వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో నివేదికలు వెలువడ్డాయి. తాజాగా దీనిపై WHO స్పందించింది.
జెనీవా: కరోనా (Coronavirus).. ఈ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. అడపాదడపా కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి అదుపులోనే ఉంది. అయితే ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి, ఇన్ని దేశాలకు పాకిందనే దానిపై కచ్చితమైన సమాచారం మాత్రం ఇంతవరకు లభించలేదు. ఈ వైరస్ చైనా ల్యాబ్ నుంచే లీక్ అయిందని తొలి నుంచీ అనుమానాలు వ్యక్తమవ్వగా.. దానిపై అమెరికా ఇటీవల మరో నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. కొవిడ్ -19 మూలాల గురించి తెలిసిన సమాచారాన్ని తమతో పంచుకోవాలని డబ్ల్యూహెచ్‌వో (WHO) అన్ని దేశాలను కోరింది.
‘కరోనా (Coronavirus) మూలాల గురించి ఏ దేశం వద్ద అయినా సమాచారం ఉంటే.. దానిని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ సైన్స్ సంస్థలకు వెల్లడించాలి. ఇది అత్యావశ్యకం. దీనిని సేకరించేది ఏ ఒక్కరినో నిందించడానికి కాదు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ముందస్తుగా ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగానే ఈ సమాచారాన్ని కోరుతున్నాం. కరోనా మూలాన్ని గుర్తించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ WHO వదిలేయదు’ అని ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ (Tedros Adhanom Ghebreyesus) అన్నారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా (Covid 19) వైరస్ జన్మస్థానం చైనా (china)లో ఓ ల్యాబ్ నుంచే జరిగిందని అమెరికా (USA)కు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. ఈ సంస్థ కొత్తగా సేకరించిన నిఘా సమాచారం మేరకు ల్యాబ్ లీక్‌పై ఓ నిర్ణయానికి వచ్చింది. ది ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లో అత్యున్నత స్థాయి నిపుణులు ఉండటంతో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకొంది. అమెరికాలో జాతీయ పరిశోధనశాలలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంటుంది. వీటిల్లో కొన్ని అత్యున్నత స్థాయి జీవ పరిశోధనలు చేస్తున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ నివేదికను చైనా తీవ్రంగా ఖండించింది. ఇదొక దుష్ప్రచారం అని కొట్టిపారేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Bengaluru: యువతిపై ఘోరం.. కారులోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం!
-
Movies News
Social Look: ముంబయిలో మెరిసిన శోభిత.. నైనా ‘కాఫీ’ కప్పు!
-
India News
Delhi Liquor Scam: మనీశ్ సిసోదియాకు బెయిల్ నిరాకరణ
-
Sports News
Ravindra jadeja: సీఎస్కేకు మద్దతు ఇవ్వండి.. గుజరాత్ అభిమానులకు జడేజా విజ్ఞప్తి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Education News
TS Eamcet: తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీలివే!