Vivek Ramaswamy: అమెరికా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే.. వివేక్‌ రామస్వామి కీలక వ్యాఖ్యలు

అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సీఈవోను ఏర్పాటు చేయాలని రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు.

Updated : 26 Sep 2023 15:54 IST

వాషింగ్టన్‌ : ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన అమెరికా 2021లో కొవిడ్‌ వల్ల 5.9 లక్షల కోట్ల డాలర్ల సంపదను కోల్పోయింది. అప్పటి నుంచి అగ్రరాజ్యం వృద్ధి రేటు దాదాపు మందగమనంలోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దానిపై రిపబ్లికన్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థుల రేసులో ఉన్న వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) స్పందించారు.

సోమవారం ఆయన ఓ కార్యక్రమంలో అమెరికా ఆర్థిక సంక్షోభం (national debt crisis) పై కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు అగ్రదేశం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తిని సీఈవో (CEO) గా తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రతి విభాగాన్ని సున్నా నుంచి మొదలపెడతామని పేర్కొన్నారు. గతేడాది బడ్జెట్ లో చేసిన తప్పులు చేయకుండా అంతా పారదర్శకంగా జరిగేలా చూస్తామని తెలిపారు.

జాతీయ రుణ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు జీరో బేస్‌ ఫెడరల్‌ బడ్జెట్ (zero-base budget) ను ప్రతిపాదించారు. అమెరికా జాతీయ రుణ సంక్షోభంలో ఉన్న మాట వాస్తవమేనని, దానిని పరిష్కరించడానికి రాజకీయాలకు అతీతంగా పనిచేసే సీఈవోను తీసుకుంటామని రామస్వామి అన్నారు.

‘గతంలో ఔషధరంగంలో ఎన్నో కంపెనీలకు పోటీగా బయోటిక్‌ కంపెనీను ఏర్పాటు చేసి అభివృద్ధి చేశాను. బ్లాక్‌ రాక్‌, వాన్‌గార్డ్‌ తో పోటీగా స్ట్రైవ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ను తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు ఫెడరల్‌ ప్రభుత్వానికి అంతకంటే గొప్ప పోటీగా నిలబడబోతున్నాను’ అని వివేక్‌ రామస్వామి అన్నారు.

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) దూసుకెళ్తున్నారు. మరోవైపు.. ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణ కోసం వివేక్‌తో ‘ప్రత్యేక విందు’ కు పలువురికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో పాల్గొనేందుకు 50 వేల డాలర్ల పైనే చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు