Bonus: ఉద్యోగులకు లేడీ బాస్ సర్ప్రైజ్.. ఒక్కొక్కరికి ₹80లక్షలు బోనస్!
ఆర్థిక మాంద్యం నీడలు కమ్ముకొస్తున్నాయంటూ పలు ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించాలని ప్రయత్నిస్తున్న వేళ ఓ మైనింగ్ సంస్థ యజమానురాలు తమ ఉద్యోగులకు సర్ప్రైజ్ ఇచ్చారు. క్రిస్మస్ బోనస్ పేరిట కొందరు ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.80లక్షల చొప్పున ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు ఉద్యోగుల తొలగింపు, లేఆఫ్‌ల పేరుతో భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడు ఏమవుతుందోనన్న భయాలు ఉద్యోగుల్ని వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలో మైనింగ్ మొఘల్‌గా పేరొందిన జార్జినా (గినా) హోప్ రెన్‌హార్ట్ తమ ఉద్యోగులకు సర్ప్రైజ్ ఇచ్చారు. క్రిస్మస్ బోనస్‌గా ఒక్కొక్కరికి లక్ష డాలర్లు చొప్పున (దాదాపు రూ.80లక్షలకు పైనే) ఇచ్చి తన పెద్ద మనసుని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని హాన్కాక్ ప్రోస్పెక్టింగ్ అనే మైనింగ్, అగ్రికల్చరల్ కంపెనీకి రెన్‌హార్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. 34 బిలియన్ డాలర్ల సంపదతో ఆస్ట్రేలియాలో అత్యంత సంపన్నుల జాబితాలో ఆమె కూడా ఒకరు. తన తండ్రి స్థాపించిన కంపెనీ హాన్ కాక్ ప్రోస్పెక్టింగ్కు చెందిన రాయ్‌హిల్ అనే మరో సంస్థలో ఉద్యోగులతో ఇటీవల అకస్మాత్తుగా ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పది మంది పేర్లు చదివి వినిపించారు. వారందరికీ లక్ష అమెరికన్ డాలర్ల చొప్పున క్రిస్మస్ బోనస్‌గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆమె ప్రకటనతో ఆ ఉద్యోగులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ బోనస్ అందుకున్న ఉద్యోగుల్లో మూడు నెలల క్రితమే ఆ కంపెనీలో చేరిన ఉద్యోగి కూడా ఒకరు ఉన్నారు. గత 12 నెలల కాలంలో ఆ కంపెనీ 3.3 బిలియన్ డాలర్ల లాభాల్ని సంపాదించిందని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pakistan: భారత్‌తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్‌లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్‌లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్‌కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్‌కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్‌కు వాటా