viral news: కొనేవారు లేక తుక్కుగా మారనున్న అతిపెద్ద క్రూజ్‌ నౌక..!

తయారీదారులు దివాలా తీయడంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్‌ నౌకల్లో ఒకటి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఇప్పుడు జర్మనీ నౌకానిర్మాణ సంస్థలో ఉన్న ఆ క్రూజ్‌ తుక్కుగా మారనుంది.

Published : 21 Jun 2022 16:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తయారీదారులు దివాలా తీయడంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్‌ నౌకల్లో ఒకదాని నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఇప్పుడు జర్మనీ నౌకానిర్మాణ సంస్థలో ఉన్న ఆ క్రూజ్‌ తుక్కుగా మారనుంది. జర్మనీ బాల్టిక్‌లోని విస్మర్‌ షిప్‌యార్డ్‌లో ఎంబీ వెర్ఫెటన్‌ షిప్‌యార్డ్‌ అసంపూర్తిగా నిర్మించిన గ్లోబల్‌ డ్రీమర్‌-2ను తుక్కు ధరకే విక్రయించనున్నారు.  ఎంబీ వెర్ఫెటన్‌ సంస్థ దివాలా తీయడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఈ నౌక తయారీ కోసం ఉన్న భారీ యంత్రాలు, ఇతర పరికరాలను కూడా విక్రయించనున్నట్లు ఇన్సాల్వెన్సీ నిర్వాహకుడు క్రిస్టాఫ్‌ మోర్గాన్‌ వెల్లడించారు.

9,000 మంది ప్రయాణికులు పట్టేలా గ్లోబల్‌ డ్రీమ్‌-2 నౌకను నిర్మించారు. దీని నిర్మాణం కూడా దాదాపు పూర్తికావచ్చింది. కానీ, 2022 జనవరిలో ఈ నౌక నిర్మాణం చేపట్టిన ఎంవీ వెఫ్టెన్‌ దివాలా తీసింది. విస్మర్‌ షిప్‌యార్డును థైసన్‌క్రూప్‌ నేవల్‌ యూనిట్‌ కొనుగోలు చేసింది. దీంతో నిర్మాణంలో ఉన్న ఈ నౌకను  విస్మర్‌ షిప్‌ యార్డు నుంచి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. 

కరోనా వ్యాప్తితో క్రూజ్‌ షిప్‌ పరిశ్రమ పూర్తి కష్టాల్లో చిక్కుకుపోయింది. ఆ ప్రభావంతోనే వెప్టెన్‌ దివాలా తీసింది. గ్లోబల్‌ డ్రీమ్‌-2 కంటే ముందు గ్లోబల్‌ డ్రీమ్‌ అనే నౌకను నిర్మించారు. అప్పట్లో ప్రయాణికుల సామర్థ్యం ఆధారంగా ప్రపంచంలో అదే అతిపెద్ద నౌక. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని