Ukraine Crisis: 113 విమానాలు రష్యార్పణం..!

పశ్చిమ దేశాల ఆంక్షలు ఐర్లాండ్‌కు చెందిన ఓ సంస్థకు పీడకలగా మారాయి. ఆ సంస్థకు చెందిన 113 భారీ విమానాలను రష్యా సీజ్‌ చేసింది. ఉక్రెయిన్‌ పై

Updated : 18 May 2022 15:21 IST

 పశ్చిమ దేశాల ఆంక్షల ఫలితం

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమ దేశాల ఆంక్షలు ఐర్లాండ్‌కు చెందిన ఓ సంస్థకు పీడకలగా మారాయి. ఆ సంస్థకు చెందిన 113 భారీ విమానాలను రష్యా సీజ్‌ చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగినందుకు పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకొంది. ఐర్లాండ్‌కు చెందిన ఏరోకాప్‌ హోల్డింగ్స్‌కు చెందిన 113 విమానాలు, 11 ఇంజిన్లను రష్యా అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. రష్యా చర్యలు తీసుకోవడానికి ముందే 22 విమానాలు, 3 ఇంజిన్లను మాత్రం విజయవంతంగా ఏరోకాప్‌ హోల్డింగ్స్‌ వెనక్కి తెచ్చుకోగలిగింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఏరోకాప్‌ కంపెనీ ప్రస్తుత త్రైమాసికానికి 2.7 బిలియన్‌ డాలర్ల మేరకు ప్రీటాక్స్‌ ఛార్జీని ప్రకటించింది. ఫలితంగా 500 మిలియన్‌ డాలర్ల లాభాన్ని ప్రకటించాల్సిన స్థానంలో.. 2 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చూపింది. వాస్తవానికి ఈ త్రైమాసికంలో వ్యాపారం బాగానే జరిగిందని కంపెనీ పేర్కొంది. కొవిడ్‌ దేశాలు కోలుకోవడంతో.. విమానయానం పుంజుకొని భవిష్యత్తు బాగుంటుందని ఏరోకాప్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నివేదిక వెలువడిన తర్వాత కంపెనీ షేర్లు 6శాతం పెరగడం గమనార్హం.

ఈ కంపెనీకి మొత్తం 1,624 విమానాలు ఉన్నాయి. రష్యాలో కోల్పోయిన విమానాలు.. కంపెనీ వద్ద ఉన్న మొత్తం విమానాల విలువలో సుమారు ఐదు శాతం వరకు ఉంటాయి. వాస్తవానికి రష్యాలో వదిలేసిన విమానాలకు ఆపరేటింగ్‌ సర్టిఫికెట్లు లేకపోవడంతో అవి నిరుపయోగంగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని