Ice Cream: ఈ ఐస్‌క్రీమ్ చాలా కాస్ట్‌లీ గురూ.. ధర రూ.5.2లక్షలు
World's most expensive ice cream: జపాన్‌కు చెందిన ఓ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ను తయారుచేసింది. దీని ధర తెలిస్తే అవాక్కవాల్సిందే. అవును మరీ.. ఏకంగా రూ.5లక్షలకు పైమాటేనండోయ్..!
ఇంటర్నెట్ డెస్క్: ఐస్‌క్రీమ్ (Ice Cream).. ఆ పేరు చెబితేనే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ నోరూరుతుంది. ఇక, మండు వేసవిలో చల్లచల్లని ఐస్‌క్రీమ్ అలా నోట్లో వేసుకుంటే.. ఆహా ఆ అనుభూతే ఎంత బాగుందో కదా..! సాధారణంగా ఐస్‌క్రీమ్‌ల ధర ఎంత ఉంటుంది.. పదో, పాతికో.. మహా అయితే వంద.. ఇంకా ప్రత్యేకమైనదైతే రూ.వేలల్లో ఉంటుంది. కానీ, ఈ ఐస్‌క్రీం కొనాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే..! అవునండీ జపాన్ (Japan)లో అమ్మే ఈ ఐస్‌క్రీమ్ ధర అక్షరాలా దాదాపు రూ. 5.2 లక్షలు. ఆ ఐస్‌క్రీమ్‌లో అంత స్పెషల్ ఏముంది అని ఆశ్చర్యపోతున్నారా? అదేంటో మీరే చదివేయండి..!
జపాన్‌కు చెందిన ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ సెలాటో (Cellato).. ఓ ప్రత్యేకమైన ఐస్‌క్రీమ్ (Ice Cream) వెరైటీని తయారుచేసింది. అత్యంత అరుదుగా దొరికే పదార్థాలతో కలిపి చేసిన ఈ డెజర్ట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా సరికొత్త రికార్డు సాధించింది. ఈ ప్రత్యేక ఐస్‌క్రీమ్‌ను 8,73,400 జపనీస్ యెన్ (భారత కరెన్సీలో దాదాపు రూ.5.2లక్షలు)ల చొప్పున విక్రయిస్తోంది. దీని తయారీలో ఉపయోగించిన వైట్ ట్రఫుల్ అనే అరుదైన పదార్థాన్ని ఇటలీలోని ఆల్బా నుంచి తెప్పించింది. ఈ ట్రఫుల్ ధర కిలోకు 2 మిలియన్ జపనీస్ యెన్‌లు ఉంటుందట. ఆల్బాలో మాత్రమే దొరికే దీని సువాసన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనివల్లే ఈ ఐస్‌క్రీమ్ ధర ఇంతగా ఉందట. దీంతో పాటు పర్మిజియానో రెగ్గియానో అనే చీజ్, సేక్ లీస్ అనే వైట్ సాస్ వంటి పదార్థాలు కూడా ఇందులో వాడారు.
దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా ఈ డెజర్ట్ గిన్నిస్ రికార్డు (Guinness World Record) సాధించింది. అయితే కేవలం ఖరీదైన ఐస్‌క్రీమ్ (Ice Cream)ను తయారు చేయడమే గాక.. యూరోపియన్, జపనీస్ పదార్థాలను కలిపి ఓ కొత్త వంటకాన్ని రూపొందించడమే తమ లక్ష్యమని సెలాటో సంస్థ చెబుతోంది. దీన్ని తయారు చేయడానికి ఒసాకాలోని ప్రముఖ ఫ్యూజన్ రెస్టారెంట్ రివీలో పనిచేసే ప్రధాన చెఫ్ తడయోషి యమడను ప్రత్యేకంగా నియమించుకుంది. సెల్లాటో నియమించుకున్నాడు. దీన్ని తయారు చేసేందుకు ఏడాదిన్నర పాటు కష్టపడినట్లు సెలాటో ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎన్నోసార్లు విఫలమైన తర్వాత ఈ అమోఘమైన రుచిని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. దీని రుచిని తెలుసుకునేందుకు సంస్థలో టేస్టింగ్ సెషన్లు కూడా ఏర్పాటు చేశారట. తయారుచేసిన ప్రతిసారీ సిబ్బందికి రుచి చూపించి అభిప్రాయాలు సేకరించారట. ఏదేమైనా.. ఈ ఐస్‌క్రీమ్ చాలా కాస్ట్‌లీ గురూ..!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana Formation Day: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు
-
India News
IRCTC: కేటరింగ్ సేవల్లో సమూల మార్పులు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
General News
Pawan Kalyan: పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలి: పవన్‌కల్యాణ్
-
Sports News
WTC Final: ఓవల్ ఎవరికి కలిసొచ్చేనో?
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Gold Smuggling: బంగారాన్ని సముద్రంలో విసిరేసిన స్మగ్లర్లు.. గాలించి 11 కేజీలు వెలికితీశారు!