Atlanta: ప్రపంచంలోనే అత్యధిక వయసున్న మగ గొరిల్లా ఓజీ.. కన్నుమూత

ప్రపంచంలోనే అత్యధిక వయసున్న మగ గొరిల్లాగా పేరొందిన ఓజీ.. కన్నుమూసింది. 61 ఏళ్ల ఓజీ..

Published : 27 Jan 2022 19:19 IST

అట్లాంటా: ప్రపంచంలోనే అత్యధిక వయసున్న మగ గొరిల్లాగా ఓజీ.. కన్నుమూసింది. 61 ఏళ్ల ఓజీ.. అమెరికాలోని అట్లాంటా జంతు ప్రదర్శనశాలలో చనిపోయింది. ఓజీ మరణించినట్లు అట్లాంటా జంతుప్రదర్శనశాల వర్గాలు వెల్లడించాయి. ఓజీ చనిపోవడానికి గల కారణాలు స్పష్టంగా తెలియడంలేదని తెలిపాయి. వారం రోజులుగా ఓజీకి ఆకలి మందగించినట్లు జూ అధికారులు చెప్పారు. ఓజీ అత్యధిక వయసు గల మగ గొరిల్లాగా గుర్తింపు పొందడమే కాకుండా.. ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన గొరిల్లాలలో మూడోది. ఓజీ మరణం.. అట్లాంటా జంతుప్రదర్శనశాలకు తీరని లోటుగా పేర్కొంటూ.. జూ అధ్యక్షుడు, సీఈవో రేమండ్ కైండ్ విచారం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని