Guinness World Record: ప్రేమతో ఒక్కటై.. ‘పొట్టి జంట’ గిన్నిస్‌ రికార్డు

ప్రేమ వివాహంతో ఒక్కటై.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా గిన్నిస్‌ రికార్డును సృష్టించారు ఈ దంపతులు.

Published : 13 Jun 2024 23:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొందరు తొలిచూపులోనే ప్రేమలో పడుతుంటారు. అందుకు కారణమేదైనా.. కలిసి కలకాలం జీవించాలని తాపత్రయ పడుతుంటారు. నిజమైన ప్రేమకు అందంతో పని లేదని.. హృదయాలు కలిస్తే చాలని భావిస్తారు. ఈ క్రమంలో తమ ప్రేమకు శారీరక ఆకృతి అడ్డుకాదని నిరూపించింది ఓ మరుగుజ్జు జంట. దశాబ్దం పాటు ప్రేమలో మునిగి తేలి, వివాహబంధంతో ఒక్కటైన ఈ జంట.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగానూ గిన్నిస్‌ రికార్డు సృష్టించారు.

బ్రెజిల్‌కు చెందిన పాలో, కత్యూసియాకు 2006లో సోషల్‌మీడియా వేదికగా పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. పదేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకొని 2016లో వివాహం చేసుకున్నారు.

ఒక డాలరు పెట్టి కొన్న పాత పేపర్లలో.. అన్నీ సైనిక రహస్యాలే!

పాలో 35.54 అంగుళాల ఎత్తుండగా.. కత్యూసియా 35.88 అంగుళాల పొడవు ఉన్నారు. వీరిద్దరూ వివాహం చేసుకోవడంతో ప్రపంచంలోనే అత్యంత పొట్టి జంటగా రికార్డు సృష్టించారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని