Xi and Putin: బాలి సదస్సుకు జిన్‌పింగ్‌, పుతిన్‌..!

ఇండోనేషియా రాజధాని బాలీలో నవంబర్‌లో జరగనున్న జీ-20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఇండోనేషియా

Published : 19 Aug 2022 13:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండోనేషియా రాజధాని బాలీలో నవంబర్‌లో జరగనున్న జీ-20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడొడొ ప్రకటించారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. ‘జిన్‌ పింగ్‌ వస్తున్నారు. అధ్యక్షుడు పుతిన్‌ కూడా వస్తున్నారు’ అని చెప్పారు. ఈ ఇద్దరూ జీ-20కి హాజరు కానున్నట్లు చెప్పడానికి తొలి ధ్రువీకరణ ఇదే.

ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు హాజరుకానున్న తొలి అంతర్జాతీయ సదస్సు ఇది. ఇక కొవిడ్‌ వ్యాప్తి మొదలైన తర్వాత 2020 నుంచి షీజిన్‌పింగ్‌ దేశం దాటడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కూడా పాల్గొనే అవకాశం ఉండటంతో దీనికి ప్రాధాన్యం నెలకొంది. 

ఇటీవల కాలంలో చైనా, అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తైవాన్‌లో పెలోసీ పర్యటన, మానవహక్కుల విషయంలో విభేదాలు తీవ్రమయ్యాయి. ఇక రష్యా- ఉక్రెయిన్‌ నేతలు ఇక్కడ ముఖాముఖీ కలిసే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో యుద్ధం విషయంలో శాంతి ప్రస్తావన రావచ్చని భావిస్తున్నారు.  మరో వైపు రష్యాను జీ-20 సభ్యత్వం నుంచి తొలగించాలని వాషింగ్టన్‌ డిమాండ్‌ చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని