Xi Jinping : చైనా సైన్యం పరిధిని విస్తృతం చేసిన జిన్‌పింగ్‌..!

విదేశాల్లో చైనా ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అధికారాలు, సామర్థ్యాల విస్తర్ణకు ఆ దేశ అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ ఆమోదం తెలిపారు. ఈ ఆదేశాలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

Published : 15 Jun 2022 01:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విదేశాల్లో చైనా ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అధికారాలు, సామర్థ్యాల విస్తరణకు ఆ దేశ అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ ఆమోదం తెలిపారు. ఈ ఆదేశాలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పీఎల్‌ఏ యుద్ధేతర కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి. అమెరికా కూడా 1993నుంచి ఇటువంటి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 2013లో ఈ ప్రతిపాదనలు తొలిసారి జిన్‌పింగ్‌ ఎదుటకు రాగా.. తాజాగా ఆమోదముద్రవేశారు. ఈ ఆదేశాలలో ప్రధానంగా ఆరు ప్రధాన అంశాలు ఉన్నాయి. ఆస్తులు, దేశ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలు, స్థానిక సుస్థిరత వంటి వాటిపై పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ పనిచేయనుంది. 

చైనా ఇటీవల పసిఫిక్‌ సముద్రంలోని సాల్మన్‌ ద్వీపాలతో చేసుకొన్న ఒప్పందం ప్రకారం అక్కడి పెట్టుబడులను కాపాడుకొనే హక్కును దక్కించుకొంది. ఇటువంటి ఒప్పందాలకు అనుగుణంగా చైనా సైన్యం అధికారాల పరిధిని జిన్‌పింగ్‌ విస్తరించారు. 2013లో చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మిలటరీ సైన్సెస్‌ ఈ ప్రతిపాదనలు చేసింది. శత్రు సైన్యాన్ని యుద్ధం చేయకుండానే ఓడించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఈ అధికారాలను వాడతారు. చైనాకు, పీఎల్‌ఏకు యుద్ధేతర కార్యకలాపాలు అద్భుతమైన ఇమేజీని తీసుకువస్తాయని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మిలటరీ సైన్సెస్‌ పేర్కొంది. విదేశీ మీడియాను అవసరమైతే నియంత్రించేందుకు కూడా పీఎల్‌ఏ పనిచేయవచ్చని పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని